దగ్గుబాటి సురేష్ అంటే ఆయనొక పెద్ద నిర్మాత ..అతని తండ్రి పెద్ద నిర్మాత .గత మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని శాసిస్తున్న కుటుంబాల్లో దగ్గుబాటి కుటుంబం ఒకటి సినీ విమర్శకులు చెబుతుంటారు .రాష్ట్రంలో ఉన్న సినిమా ధియేటర్లలో సగం వీరివే అని అందరు అంటుంటారు .వందల కోట్ల టర్న్ ఓవర్ చేసే సినిమాలు ..లగ్జరీ లైఫ్ ఇది దగ్గుబాటి కుటుంబం .
అలాంటి సంపన్నమైన ..పేరు ప్రఖ్యాతులు ఉన్న దగ్గుబాటి సురేష్ బాబు ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .అదే మిల్క్ వ్యాపారం .తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న ముప్పై ఎకరాల ఫాం హౌజ్ లో ఆవులను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు .అంతే కాకుండా ఈ ముప్పై ఎకరాల్లో ఆవులను పెంచి స్వచ్చమైన పాల వ్యాపారం చేయాలనీ ఆయన అనుకుంటున్నారు అంట .
ఇటివల ఆయన అనారోగ్యానికి గురి కావడానికి ప్రధాన కారణమైన మార్కెట్లో దొరికిన మిల్క్ తదితర మొత్తం కల్తీ కావడంతో ప్రజలు ఎవరు వాటి భారిన పడకుండా ఉండటానికే తను ఈ నిర్ణయం తీసుకున్నాను ..అంతే కాకుండా తము అమ్మే మిల్క్ లీటర్ కేవలం నూట యాబై రూపాయలు ధర ఉంటుందని ఆయన వివరించారు ..