ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ చక్కర్లు కొడుతుంది. అదే ఏమీటంట ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్పయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర భారీ విజయం సాదించడం. అలుపెరగని బాటసారిలా… జనం ఆదరణతోనే తనలో కొత్త ఉత్సాహన్ని నింపుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్ . ప్రజల కష్టాలు వింటూ.. కన్నీరు తుడుస్తూ… భరోసానిస్తున్నారు. గతేడాది నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన యువనేత సంకల్పయాత్ర 196 రోజులుగా అలుపనేదే లేకుండా కష్టపడుతున్నారు. అయితే ఈ పాదయాత్ర టీడీపీకి పెద్ద దెబ్బ తగిలింది. వైసీపీలో భారీగా చేరికలు జరిగాయి.
అంతేకాదు ఒక్కసారిగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ విజయం అని ప్రతి నోట అదే మాట వచ్చేలాగా ఏపీ రాజకీయన్ని పూర్తిగా మార్చడు వైఎస్ జగన్. దీంతో టీడీపీ నేతలు ఇక రాజకీయలకు గుడ్ బై చెబుతున్నారు. వారిలో గుంటూరు కుచెందిన సీనియర్ రాజకీయ దిగ్గజం, ప్రస్తుత టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడ ఉన్నారు. కాంగ్రెస్‌లో వీర విధేయుడిగా ఉన్న రాయపాటి.. 2014 విభజన సమయం లో పార్టీతో విభేదించి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆ సమయంలోనే నరసరావు పేట ఎంపీగా టికెట్ సాధించారు. అయితే, ఆయనవచ్చే ఎన్నికల్లో తాను ఇక రాజకీయాలకు గుడ్ బై చెబుతానని పలు సందర్బాల్లో ప్రకటించాడు. ఈ క్రమంలోనే ఆయన తన కుమారుడు రాయపాటి రంగారావును రాజకీయాల్లోకి దింపుతానని కూడా చెప్పాడు. దీంతో వైసీపీ నేతలు ఎలాగో ఇంకొ పది సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కదా అందుకే ఇలా రాజకీయాలకు గుడ్ బై చెప్పారని అంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.