ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన వైసీపీ ఎంపీల రాజీనామాను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇవాళ ఆమోదించారు. రాజీనామా చేసిన వారిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నారు. వీరందరు ఏప్రిల్-6న స్పీకర్‌కు రాజీనామా లేఖలను సమర్పించారు. అయితే.. ఏపీలో ఖాళీ అయిన లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఉంటాయా..? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
