విశాఖపట్నం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు మంచి రాజకీయనాయకుడు. కాపు సామాజికవర్గంపై ఈయనకు మంచి పట్టు ఉంది. అందుకే ఇతను ఇప్పటివరకు మూడు పార్టీలు మారిన కానీ ఆ పార్టీ లలో ఉన్నత పదవులు వారిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈయన 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ లో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గా కొనసాగుతున్నాడు .అయితే ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత పార్టీ అయిన టీడీపీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
see also:సీఎం రమేష్.. కడప ఉక్కుఫ్యాక్టరీ గురించి కాదు.. కాంట్రాక్ట్ ల కోసం కపట నాటకం
ఏపీ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గత కొద్దీరోజులుగా వారి మధ్య దూరం ఇంకా పెరిగినట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి గంటా డుమ్మా కొట్టారు. ఒక కారణంగా గంటా గైర్హాజరైనట్లు చెబుతున్నా, కారణం వేరే ఉండొచ్చని నేతలు చర్చించుకుంటున్నారు. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఫై అసంతృప్తి గా ఉండడమే కారణమని కొంతమంది అంటున్నారు. గతంలో ఎన్నో పార్టీలు మారిన గంటా ఇప్పుడు వైసీపీలోకి పోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.
see also:వైఎస్ జగన్ 195వ రోజు పాదయాత్ర.. 2,400 కిలో మీటర్లు