ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టింది. పశ్చిమగోదావరి జిల్లాలో యాత్రను ముగించుకొని.. కొవ్వూరు నుంచి బయలుదేరి రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదుగా జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే… జగన్ కు భారీగా వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్ తమ జిల్లాలోకి వస్తున్నారని వైసీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు వేలాదిగా తరలి రావడంతో రోడ్ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రమైంది. వేలాదిగా తరలివచ్చిన జనవాహిని మధ్య జగన్ అభివాదం చేస్తూ అడుగులు వేశారు. తమ అభిమాన నేత వైఎస్ జగన్ను చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలిరావడంతో రోడ్ కం రైల్వే బ్రిడ్జి వద్ద పండగ వాతావరణం కనిపించింది.
see also:చంద్రబాబు మైండ్ గేమ్ ..వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే టిక్కెట్ ఇవ్వడో..వారు ఓడిపోతారని పచ్చమీడియాతో సర్వే..
అంతక ముందు పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర భారీగా విజయం సాధించింది. జిల్లాలో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాదయాత్రలో పాల్గొన్నారు. పోలవరం ఏఎంసీ మాజీ ఛైర్మన్ పీపీఎన్ చంద్రరావు.. ఈయన చేరక ముందు టీడీపీ, కాంగ్రెస్స్ మాజీఎమ్మెల్యేలు , సీనియర్ నేతలు, సర్పంచ్ లు భారీగా కార్యకర్తలు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో దారుణంగా చితికిపోయిన రొయ్యల, చేపల రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. అంతేకాదు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని..ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని ప్రజల్లో నమ్మకం చేకురుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా..తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ అత్యదిక సీట్లు గెలిపిస్తారని టీడీపీ నేతలే చర్చించుకున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఈవిధంగా తూ..గో జిల్లా..ప..గో జిల్లాలో వైఎస్ జగన్ హవా నడుస్తుంది.