Home / MOVIES / టాలీవుడ్ బ‌ఢా నిర్మాత‌ల‌కు షాకింగ్ న్యూస్‌..!

టాలీవుడ్ బ‌ఢా నిర్మాత‌ల‌కు షాకింగ్ న్యూస్‌..!

తెలుగు చిత్ర సీమ‌లో తాజాగా సంచ‌ల‌నంగా మారింది అమెరికాలో తెలుగు హీరోయిన్స్ సెక్స్ రాకెట్‌. గ‌త బుధ‌వారం వెలుగు చూసిన ఈ సెక్స్‌రాకెట్ గురించి తాజాగా ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి. సినీ ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలురాని ప్ర‌థ‌మ శ్రేణి, ద్వితీయ శ్రేణి వ‌ర్ద‌మాన న‌టుల‌ను డ‌బ్బు ఆశ చూపి విసిటింగ్ వీసా పేరుతో అమెరికాకు ర‌ప్పించి వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న దంప‌తుల గుట్టు ర‌ట్ట‌యింది. అందులో భాగంగానే మోదుగుల కిష‌న్‌, చంద్ర‌క‌ళ‌ల‌ను చికాగో పోలీసులు అరెస్టు చేశారు.

see also:తెలుగు స్టార్ హీరోయిన్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..!

మోదుగుమూడి కిష‌న్‌, ఆయ‌న భార్య చంద్ర‌క‌ళ‌ను అరెస్టు చేయ‌డంతో క‌థ‌లో ట్విస్ట్ రివీల్ అయింది. వీరిద్ద‌రి వ్య‌భిచార భాగోతంపై చికాగో కోర్టులో 40 పేజీల ఛార్జ్ షీట్ కూడా దాఖ‌లైంది. డిసెంబ‌ర్ 2017లో అమెరికాకు వెళ్లి వ‌చ్చిన టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోయిన్ కిష‌న్‌ను వేడుకుంటూ ఓ ఈమెయిల్ రాసింది. ఈ విష‌యాన్ని చికాగో పోలీసులే బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. ఆ ఈమెయిల్‌లో తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన బ‌ఢా నిర్మాత‌ల పేర్ల‌ను కూడా ఆ స్టార్ హీరో యిన్ పేర్కొంది.

see also:న‌టి యమున సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఆ ఈ మెయిల్‌ను చూసిన పోలీసులు ఆమెను విక్ట‌మ్ ఏగా ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. ఈమె త‌న ఈమెయిల్ లేఖ‌లో బ‌ఢా ప్రొడ్యూస‌ర్ల‌ను ఉద్దేశించి ఏమ‌ని పేర్కొందంటే..?  నాకు సినిమా అవ‌కాశాలు రావాలంటే..? ప‌డుపు వృత్తిని ఎంచుకోవాల‌ని కొంద‌రు బ‌ఢా నిర్మాత‌లు సూచించారు. వారు పంపితేనే నేను నీ వ‌ద్ద‌కు వ‌చ్చానంటూ మోదుగుమూడి కిష‌న్‌ను ఉద్దేశించి ఆ స్టార్ హీరోయిన్ మెయిల్ చేసింది. అటువంటి న‌న్ను వ్య‌భిచార కూపంలోకి దింపి.. సీక్రెట్ కెమెరాల‌తో చిత్రీక‌రించి.. న‌న్ను బ్లాక్ మెయిల్ చేయ‌డం స‌బ‌బు కాదు. ఇక‌నైనా ఆ వీడియోల‌ను డిలీట్ చేయండి.. మిమ్మ‌ల్ని వేడుకుంటున్నానంటూ మోదుగుమూడి కిష‌న్ కు ఆ స్టార్ హీరోయిన్ మెయిల్ చేసింది.

see also:శివ‌మ‌ణి చిత్రానికి.. చికాగో సెక్స్ రాకెట్‌కు సంబంధం ఏమిటో తెలుసా..??

అయితే, మోదుగుమూడి కిష‌న్‌కు బ‌ఢా నిర్మాత‌ల వ‌ద్ద స‌హ నిర్మాతగా చేసిన అనుభ‌వం ఉండ‌టం, ప్రొడ్యూస‌ర్ల‌తో ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌టం వంటివి చూస్తుంటే ఆ స్టార్ హీరోయిన్ మెయిల్ వాస్త‌వ‌మ‌నిపించక త‌ప్ప‌దు. ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్ బ‌ఢా నిర్మాత‌లు అమెరికా వెళ్లాలంటేనే భ‌య‌ప‌డుతున్నారంటూ ఓ సోష‌ల్ మీడియా క‌థ‌నం పేర్కొంది.

see also:కాలా మిగిల్చిన న‌ష్టం ఎంతో తెలుసా..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat