స్వర్గంలోని ఇంద్ర సభలో అక్కడ ఆ ఇంద్రుడి స్వాగత ప్రస్థానం ఘనం అయితే, ఇక్కడ ఈ జితేంద్రుడికీ కూడ స్వాగతం ఎం తక్కువ అన్న చందంగా కనివిని ఎరుగని రీతిలో మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎంపీ జితేందర్ రెడ్డికి షాద్ నగర్ నియోజక వర్గంలో ఘన స్వాగతం లభించింది.గులాబీ గుబాళింపుతో గ్రామాలతో పాటు కార్యకర్తలు పరవశించి పోయారు.ఈదులపల్లి గ్రామం
లో పదమూడు లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయితీ భవనం ప్రారంభోత్సవం కోసం ఎంపీ నియోజకవర్గానికి వచ్చారు.
Publiée par Sukender Reddy sur jeudi 21 juin 2018
ఈ సందర్బంగా వీర్లపల్లిశంకర్, సర్పంచ్ శ్రావణ్ తదితర నేతల ఆధ్వర్యంలో ఎంపీకి పెద్దఎత్తున వాహన శ్రేణి ఏర్పాటు చేశారు.వందలాది వాహనాలతో ర్యాలీ గ్రామాల్లోకి ప్రవేశించింది.ఈ ర్యాలీలో ఎంపి కుమారుడు,యువనాయకుడు మిథున్ రెడ్డి పాల్గోనడం విశేషం.వందలాది బైకు, కారు వాహనాలతో ఎంపీ జితెందర్ రెడ్డి కాన్వాయి రావడం విశేషం.ఈ ర్యాలీకి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరు కాక పోవడం అటుంచితే మొదట గుడి మామిడిపల్లి,మజీద్ మామిడిపల్లి గ్రామాల్లో అంబేత్కేర్ విగ్రహాన్ని ఎంపీ అట్టహాసంగా ఆవిష్కరణ చేశారు.
ఆయా సభల్లో ఎంపీ మాట్లాడుతూ అంబెడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.తెలంగాణకు నిధుల కోసం..కేంద్రంలో కృషి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సహకరించాలి అన్నారు.పనిచేసే వాడిని ప్రజలు ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.పాలమూరు ఎత్తిపోతల..కాళేశ్వరము ప్రాజెక్టులు, పూర్తి అయితే… నిధులు బాగా మిగులుతాయి.60 ఏళ్లు లూటీ చేసిన ఆంధ్ర పాలకుల నుంచి తెలంగాణకు విముక్తి.ఇప్పుడిప్పుడే తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాం అని అన్నారు.