రెండు తెలుగు రాష్ట్రాల్లో కాలా చిత్రానికి రూ.30 కోట్లకు పైగా బిజినెస్ జరిగిన విషయం తెలిసిందే. రజనీకాంత్ కు ఉన్న అభిమానుల అంచనా మేరకే ఇంత మేర బిజినెస్ జరిగిందన్నది సినీ విశ్లేషకుల మాట. అయితే, అప్పటికే ఆ స్థాయి వసూళ్లు వస్తాయా..? లేక కబాలిలాగే డిజాస్టర్ అవుతుందా..? అన్న అనుమానం ఉండేది. సీన్ కట్ చేస్తే కాలా సినిమా కూడా డిజాస్టర్‌గానే మిగిలిపోయింది. ఒక్క తమిళనాట తప్ప.. ప్రపంచ వ్యాప్తంగా భారీ దెబ్బ కొట్టింది కాలా చిత్రం.
see also:చరణ్ @రూ.75 కోట్లకు ఫైనల్..!
జూన్ 7న భారీగా విడుదలైన కాలా చిత్రానికి మొదటి రోజునే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో రికార్డులు కూడా బద్దలు కాలేదు. కాకపోతే, రజనీకాంత్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి ఓ మోస్తారు వసూళ్లు వచ్చాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సాధించిన వసూళ్లూ కేవలం 7 కోట్ల రూపాయల పైచిలుకు మాత్రమే.
see also:సంచలన విషయాలు చెప్పిన కరాటే కళ్యాణీ..!
అంటే ఇంటకా 23 కోట్లు నష్టమన్నమాట. రజనీకాంత్ కోసం పోటీపడి సినిమా హక్కులను కొన్న వారికి 23 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్న మాట.