చికాగో సెక్స్ రాకెట్ ఘటన టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. చికాగోలో వ్యభిచార దందా నిర్వహిస్తూ తెలుగు సినీ నిర్మాత దంపతులు పట్టుబడటమే ఇందుకు ప్రధాన కారణం. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన సహ నిర్మాత మోదుగుమూడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ అతని భార్య చంద్రకళను అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చికాగో సెక్స్ రాకెట్లో ఇద్దరు స్టార్ హీరోయిన్లు, ముగ్గురు స్టార్ యాంకర్లు, సహ నటులు ఉన్నట్టు తెలుస్తోంది.
see also:కాలా మిగిల్చిన నష్టం ఎంతో తెలుసా..?
ఈ క్రమంలో కిషన్ అలియాస్ శ్రీరాజ్ అనే వ్యక్తి అమెరికా నెంబర్‌తో తనకు ఫోన్ చేసిన విషయాన్ని ఈ సందర్బంగా నటి ప్రగతి గుర్తు చేసుకుంది. అయితే, అతను మాట్లాడే విధానం తనకు నచ్చక పోవడంతో తిరస్కరించానని, అయినపపటికీ వారు ప్రచురించిన పోస్టర్లో తన ఫోటోను ముద్రించారని చెప్పుకొచ్చింది. ఆ ఈవెంట్లో తాను పాల్గొనలేదని చెప్పుకొచ్చింది. చాలా రోజులుగా తాను అమెరికా వెళ్లలేదని చెప్పిన సినీ నటి ప్రగతి 2014, 2016లో సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తితో కలిసి ఈవెంట్లలో పాల్గొన్నట్టు ఒప్పుకుంది. అయితే, తెలుగు సంఘాల వారు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న తనకు అక్కడి పరిస్థితులు చూసి ఆశ్చర్య మేసిందని, తనతో పాటు కార్యక్రమానికి వచ్చిన వాళ్లంతా.. షాపింగ్ పేరుతో ఏవేవో మాట్లాడుకోవటాన్ని తాను విన్నట్టు ప్రగతి చెప్పింది. నటి ప్రగతికి చికాగో సెక్స్ రాకెట్‌కు ఎలాంటి సంబందం లేదని తెలుస్తోంది.