ప్రభాస్ స్నేహితుల బ్యానర్‌గా మొదలైన యూవీ క్రియేషన్స్ టాలీవుడ్‌లో విజయవంతంగా నిర్వహించబడుతోంది. సినిమా నిర్మాణాల్లో మాత్రమే కాకుండా, డిస్ట్రిబ్యూషన్ తదితర విభాగాల్లో స్పీడ్‌గా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ కొన్ని జిల్లాల్లో పట్టును సాధించింది. రామ్ చరణ్ మూవీ రంగ స్థలంతో మంచి లాభాలను రాబట్టగలిగింది.
see also:సంచలన విషయాలు చెప్పిన కరాటే కళ్యాణీ..!
ప్రభాస్, చరణ్ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా నైజాం ఏరియా మొత్తానికి రంగస్థలం హక్కులను కొనుగోలు చేసిన ఈ సంస్థ భారీ లాభాలనే ఆర్జించింది. దీంతో చరణ్ తరువాత సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాలకు హోల్‌సేల్‌గా డీల్ మాట్లాడుకునేందుకు చర్చలు నిర్వహించినట్లుగా చెబుతున్నారు. ఈ సంస్థకు ఇప్పటికే సీడెడ్‌తోపాటు ఉత్తరాంద్ర, కృష్‌ణా, గుంటూరు, తూర్పు గోదావరి ఏరియాల్లో గ్రిప్ ఉంది. రంగ స్థలంతో నైజాంలో కూడా సత్తా చాటడంతో ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలకు డీల్ సెట్ చేసుకోవాలన్నది వీరి ఆలోచనగా కనిపిస్తోందని, అందులో భాగంగానే చరణ్ తరువాత సినిమాను తెరకెక్కించనున్న నిర్మాత డీవీవీ దానయ్యతో డీల్ కూడా మాట్లాడేసుకున్నారని సమాచారం. సుమారు 75 కోట్లకు ఈ బేరం ఫైనల్ కావొచ్చనది సినీ విశ్లేషకుల అంచనా.