ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భుమా అఖిలప్రియకు గతకొన్ని రోజుల క్రితమే మాజీ డీజీపీ అల్లుడు భార్గవ్ తో హైదరాబాద్ మహానగరంలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం అఖిలప్రియ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.ఇటీవలె అఖిలప్రియ మరియు భార్గవ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి తమ పెళ్ళికి రావాల్సిందిగా ఆహ్వానించి..ఆశీర్వాదం తీసుకున్నారు.తాజాగా ఇవాళ ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.తమ వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా లోకేష్ వీరిద్దరికీ లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ విషయాన్ని అఖిలప్రియ ట్విట్టర్ ద్వారా తెలిపారు . ‘అన్నా, మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీతో సమయాన్ని గడపడం గౌరవంగా భావిస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి ‘బిగ్ బ్రదర్’ అంటూ హ్యాష్ ట్యాగ్ ను జతచేశారు.కాగా ఆగస్ట్ 29న వీరి వివాహం జరగబోతున్న సనగతి తెలిసిందే.
Thank you for the best wishes Anna. Really honoured to have spent quality time with you.#bigbrother @naralokesh @Bhargavaram1987 pic.twitter.com/jdd62aWDJU
— Bhuma Akhila Reddy (@bhuma_akhila) June 21, 2018