అమెరికాలో ఎన్నో ఏళ్లుగా గుట్టుగా జరుగుతున్న సెక్స్‌రాకెట్ భాగోతాన్ని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. మోదుగు మూడి కిషన్, చంద్రకళ అనే దంపతులు టాలీవుడ్ హీరోయిన్లను ఈవెంట్స్ పేరు చెప్పి తాత్కాలిక వీసాలతో అమెరికా తీసుకొచ్చి చేస్తున్న వ్యభిచారం వెలుగుచూసింది. ఈ సెక్స్ రాకెట్‌తో మొత్తం టాలీవుడ్ ఉలిక్కి పడింది.
see also:బిగ్ బాస్-2ను తాకిన క్యాస్టింగ్ కౌచ్ …!
అయితే, ఈ వ్యవహారంపై శ్వేతాబసు ప్రసాద్ స్పందించింది. కాగా, గత శనివారం ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్వేతాబసు ప్రసాద్ మాట్లాడుతూ.. అమెరికాలో తనకు గతంలో జరిగిన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. తెలుగు సంఘాల వారు పిలిచిన ఈవెంట్‌కు వెళ్లిన సమయంలో.. తనకు ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేశారని, కార్యక్రమం ముగిసిన వెంటనే తిరుగు ప్రయాణం సమయంలో ఫ్లైట్ మిస్ కావడంతో చేసేదేమీ లేక మళ్లీ హోటల్‌కే వెళ్లానని తెలిపింది. ఆ సమయంలోనే కొందరు యువతులను హోటల్ నుంచి అరెస్టు చేసి తీసుకు పోతుండటాన్ని గమనించానని తెలిపారు. అప్పటి వరకు ఆ హోటల్లో వ్యభిచారం జరుగుతున్నట్టు తనకు కూడా తెలియదని, పోలీసులు యువతులను అరెస్టు చేసి తీసుకుపోతుండటాన్ని చూసి షాక్ అయినట్టు శ్వేతాబసు ప్రసాద్ చెప్పింది.