తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ రైతు బీమా ఆగస్టు 15నుండి అమలుచేయనున్న సంగతి తెలిసిందే.అయితే అందులోభాగంగానే రైతు జీవిత బీమా నమోదుకు ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీని ఆధారంగా తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.రైతు బీమా పత్రంలో 59 ఏండ్ల లోపువారి పేర్లు మాత్రమే భీమా పథకానికి నమోదు చేయాలని అధికారులకు సూచించింది. ఎల్ ఐసితో పాటు ఇతర భీమా సంస్థల నిబంధనల ప్రకారం 18 నుంచి 60 ఏండ్లలోపు వయస్సున్న వారికే బీమా వర్తిస్తుందని వివరించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం.
see also:మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలుతెలిపిన కేటీఆర్
2018 ఆగస్టు 15 నాటికి రైతు వయస్సు 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉండాని సూచించింది.
ఏటా ఆగస్టు 15 తేదీని ప్రమాణికంగా తీసుకుని పేర్లు నమోదు చేయనున్నట్లు తెలిపింది.
రైతుల జాబితాను తయారు చేసిన తర్వాత ప్రీమియం చెల్లించనుంది .
ఒక్కో రైతుకు 2 వేల 271 రూపాయలు ప్రీమియం కింద చెల్లించనుంది.
ప్రభుత్వం, ఎల్ ఐసి కలిసి బీమా సర్టిఫికేట్ ను రైతుకు అందజేయనున్నాయి.
బీమా సొమ్ము ఐదు లక్షలు ఎవరికి ఇవ్వాలనే స్వేచ్ఛ రైతుకే ఉంటుందని చెప్పింది .
దీనికి సంబంధించి ముందుగానే రైతు నుంచి నామినీ ప్రతిపాదన పత్రం తీసుకుంటామని తెలిపింది.
దీని ప్రకారమే నామినికి పది రోజుల్లో డబ్బు చెల్లించనుననట్లు వివరించింది. టైమ్ కు సొమ్ము ఇవ్వకుంటే LICకి జిరిమానా విధిస్తామంది. రైతుల వివరాలు ప్రతి నెలా అప్ డేట్ చేయనున్నట్లు తెలిపింది.