తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఇండియా టుడే అగ్రీ అవార్డుకు ఎంపికైనందుకు ఆ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి కి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు.
see also:తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..!!
మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని దేశానికి తలమానికంగా, ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.వ్యవసాయ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం కేటగిరీలో ఇండియాటుడే అవార్డు సాధించడం రాష్ట్ర ప్రగతికి నిదర్శనం,ఉమ్మడి రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి పోచారం దే.రైతును రాజు చేయాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరిందన్నారు .
see also:తెలంగాణ వ్యవసాయ శాఖ పురోగమనంలో మంత్రి పోచారందే కీలకపాత్ర..!!
రైతు రుణాల మాఫీ, రైతు బంధు పథకం పంటల పెట్టుబడి, రైతు బీమా వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు అన్నారు.సాగునీరు, కోతలు లేని 24 గంటల విద్యుత్, విత్తనాల, ఎరువుల కొరత లేకుండా చేయడం, రైతు ఆత్మహత్యలు నివారించడం సీఎం కేసీఆర్ కె సాధ్యమైంది.కేసీఆర్ చెబుతున్నట్లు తెలంగాణ సస్యశ్యామలం అవడం ఖాయం అన్నారు.