షికాగోలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ టాలీవుడ్‌ను షేక్ చేసేస్తోంది. అమెరికాలో అరెస్టైన మోదుగుమూడి కిషన్‌తో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి..? అన్న విషయాలపై టాలీవుడ్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొందరు వెండితెర తారలను ట్రాప్ చేసి మోదుగుమూడి కిషన్, అతని భార్య చంద్రకళ సెక్స్‌రాకెట్‌ను నడిపినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అమెరికాకు షూటింగ్ నిమిత్తం వెళ్లే హీరోయిన్లు, తమ కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్లే నటీమణులను కూడా సెక్స్‌రాకెట్‌పై ఆరా తీస్తున్నారు. తాజాగా కిషన్ సినీ తారలతో మాట్లాడిన ఫోన్ కాల్స్ బయటకు రావడంతో.. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారన్న విషయంపై సినీ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది.
see also:అమెరికా డాలర్ల కోసమే.. చికాగో సెక్స్ రాకెట్..!
ఇదిలా ఉండగా, గతంలో తెలుగు సంస్థలు చికాగోలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వెండితెర నటీమణులు ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి వారికి ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకోవడం పరిపాటిగా మారింది. ఆ క్రమంలోనూ ఇవాళ ఓ మీడియా ఛానెట్ నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న సినీ నటి కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. మోదుగుమూడి కిషన్ సినీ హీరోయిన్లను తీసుకెళ్లి వ్యభిచారం నిర్వహించడంతో ఎంత తప్పు ఉందో.. డబ్బుకు ఆశపడి పోయిన వారిదీ అంతే తప్పు ఉందన్నారు. అయితే, తాను 2011వ సంవత్సరంలో ఒకే ఒక్క సారి అమెరికాకు వెళ్లాలని, ఆ సమయంలోనే తన కళ్లెదుటే టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ షాపింగ్ (కమిట్మెంట్) కు వెళ్లిందని, అది తనకు ఆశ్చర్యం కలగించిందన్నారు. కచ్చేరి ఇచ్చేందుకు వెళ్లిన నేను.. తన కార్యక్రమం పూర్తవ్వగానే హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశానంటూ కళ్యాణి తెలిపింది.కొందరు మేనేజర్ల నుంచి షాపింగ్ పేరిట ఒత్తిళ్లు వచ్చినా.. అవేమీ పట్టించుకోకుండా తిరుగు ప్రయాణమయ్యానని కరాటే కళ్యాణ చెప్పింది.