ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్ తన పాదయాత్రను పూర్తి చేసుకుని ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాల్లో కొనసాగిస్తున్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వారి సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారి సమస్యలను వింటూ పరిష్కార మార్గాలను కొనుగొంటూ.. ప్రజల్లో భరోసాను నింపుతున్నారు. ఇలా జగన్ పాదయాత్ర ఆద్యాంతం జనాదారణ నడుమ విజయవంతంగా కొనసాగుతోంది.
see also:నారా లోకేష్ నోటి నుండి మరో ఆణిముత్యం ..!
ఇదిలా ఉండగా, జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సర్వే ఎజెన్సీలకు మళ్లీ పనిచెప్పాడు. జగన్ పాదయాత్ర పూర్తి చేసుకున్న జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం, అలాగే టీడీపీ గ్రాఫ్ తగ్గిందా..? పెరిగిందా..? అన్న అంశాలతోపాటు ఇతర పార్టీలపై ప్రజల అభిప్రాయాలను సేకరించాలని తన సర్వే ఏజెన్సీలను చంద్రబాబు ఆదేశించారట. ఆ నేపథ్యంలోనే కుప్పం రిపోర్టును తెప్పించుకుని చూసిన చంద్రబాబుకు సర్వే ఫలితాలు షాక్ ఇచ్చాయట.
see also:వైసీపీలోకి దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అల్లుడు ..!
అయితే, 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమలుకాని 600 హామీలో ప్రజలను మభ్యపెట్టి, మరో పక్క బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు వైసీపీపై కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ సీన్ 2019లో రివర్స్ కానుందట. అందులోను కుప్పం ప్రజలు మరీ ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నారట. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా..? చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎప్పుడెప్పుడు ఓటేద్దామా..? అని.
see also:చంద్రబాబు పై దుమ్ములేపుతున్న పాట..!!
చంద్రబాబు తాను రాజకీయ రంగ ప్రవేశం చేసిన మొదట్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రత్యర్థి చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఇక అప్పట్నుంచి ప్రత్యర్థుల బలం తక్కువగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్నే తాను పోటీ చేసే నియోజకవర్గంగా ఎంచుకుంటూ వస్తున్నారు. అయితే, 2019లో చంద్రబాబు తాను పోటీచేసే నియోజకవర్గాన్ని మార్చుకునే పనిలో పడ్డారట. దీనికంతటికి కారణం సర్వే ఫలితాలేనట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పట్నుంచి తమ నియోజకవర్గాన్ని మరిచిపోయారనే అభిప్రాయాన్ని కుప్పం ప్రజల నుంచి వ్యక్తమవుతుండటంతో చంద్రబాబు అక్కడ పోటీ చేసేందుకు ధైర్యం చూపడం లేదన్నది టీడీపీ వర్గాల మాట.