హుస్నాబాద్ మిషన్ భగీరథ, గౌరవెల్లి రిజర్వాయరు పనుల పురోగతి పై ఇవాళ హుస్నాబాద్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు . ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్, ప్రభుత్వ ఛీఫ్ విప్-ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, పర్యాటక శాఖ ఛైర్మన్ భూపతి రెడ్డి, జెడ్పీటీసీ రాజిరెడ్డి, ఎంపీపీ మంగ, జిల్లా ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస చారి, ఇరిగేషన్ ఈఈ రాములు, ఇంజనీరింగ్ అధికారులు, హుస్నాబాద్ నగర పంచాయతీ కమిషనర్, ఇతరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్ నగర పంచాయతీ అభివృద్ధి కోసం రూ.5కోట్లు నిధులు ఇచ్చాం. పనులు ఎందుకు సాగడం లేదంటూ.. కమిషనర్, ఇంజనీరింగ్ అధికారుల తీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల జాప్యం పై అధికారులను మంత్రి ఆరా తీశారు.
– ఆగస్టు 20వ తేదిలోపు 2 నెలలలో పనులు పూర్తి కావాలని, ఆ దిశగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని సమీక్షించి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకట్రామ రెడ్డిని కోరారు.
see also:టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ..!
– హుస్నాబాద్ ప్రాంతంలోని కాంట్రాక్టర్లంతా లెస్ కు టెండర్లు వేస్తున్నారని., అలా టెండర్లు వేస్తే ఏలా అంటూ.. నాణ్యతతో కూడిన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నదని, అలాగే ఎమ్మెల్యే సతీష్ కుమార్, అధికారులు పనులలో వేగం పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.
see also:తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..!!
– హుస్నాబాద్ లోని మినీ ట్యాంకు బండ్ – ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు మందకొండిగా సాగుతున్నాయని ఇరిగేషన్ ఈఈ రాములు తీరుపై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు.
see also:వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే..!!
– ఆగస్టు నెల 15వ తేదిలోపు హుస్నాబాద్ మినీ ట్యాంకు బండ్- ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు ఇచ్చారు.
see also:తెలంగాణ వ్యవసాయ శాఖ పురోగమనంలో మంత్రి పోచారందే కీలకపాత్ర..!!
– శనిగరం ప్రాజెక్టు పనుల పురోగతి పై ఇరిగేషన్ అధికారులను ఆరా తీశారు. ఈ మేరకు జూలై నెల 15వ తేదిలోపు పూర్తి చేస్తామని, అదే విధంగా బస్వాపూర్ చెక్ డ్యాము పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు చేశారు.