తాజాగా అమెరికాలో హీరోయిన్స్ సెక్స్ రాకెట్ బట్టబయలవడంతో టాలీవుడ్‌పై మరో పిడుగు పడింది. అమెరికాలో టాలీవుడ్ హీరోయిన్ష్‌తో సెక్స్ రాకెట్ నడిపిస్తున్న దంపతులు అరెస్టయ్యారు. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియడంతో టాలీవుడ్ హీరోయిన్స్ కూడా సెక్స్ రాకెట్ ఉన్నట్టు తేలిపోయింది.
see also:బిగ్ బాస్ 2 లోపల ఆ వ్యక్తితో పడుకోమన్నారు..సంజన సంచలనం వాఖ్యలు..!
అయితే, ఈ విషయంపైనే ఒక ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో ప్రముఖ నటి అర్చన పాల్గొని అమెరికాలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. గత సంవత్సరం తెలుగు సంఘాల వారు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనాలంటూ తనకు ఆహ్వానం అందిందని, మన తెలుగువారే కదా..! అనే ఆలోచనతో, ఆహ్వానం అందడంతో చికాగో వెళ్లినట్టు తెలిపింది.
see also:ప్రకంపనలు సృష్టిస్తున్న చికాగొ సెక్సరాకెట్ అడియో టేపులు
కార్యక్రమంలో భాగంగా వచ్చిన అతిధులందరికీ ఒక ఫైవ్ స్టార్ హోటల్లో రూములు బుక్ చేశారని, వారిలో తాను కూడా ఉన్నట్టు అర్చన తెలిపింది. తెలుగు సంఘాల కార్యక్రమాలు ముగిసిన రోజున అర్థరాత్రి తెలుగు సంఘాలకు చెందిన ఒక మేనేజర్ తన గదికి కాలింగ్ బెల్ నొక్కాడని, డోర్ తీయడంతో లోపలికి వచ్చేశాడని చెప్పింది. పూర్తి పేమెంట్ ఇచ్చేందుకు వచ్చాను మేడమ్.. ఇంకా ఏమన్నా పేమెంట్ కావాలంటే చెప్పండి మేడమ్ అని అడగసాగాడని, ఆ వ్యక్తి ప్రవర్తనను గమనించిన వెంటనే తనను రూము నుంచి బయటకు గెంటేశానని అర్చన చెప్పింది. అయినా ఆ వ్యక్తి తన చేయిపట్టుకుని ఏదో కక్షకట్టినట్టుగా లాగాడని, వెంటనే ప్రతిఘటించడంతో ఆ మేనేజర్ తన రూమును వదిలి వెళ్లిపోయాడని తెలిపింది. మరుసటి రోజున వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చేసినట్టు తన గత అనుభవాలను తెలిపింది నటి అర్చన.