ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేల వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు ప్రధాని స్థాయిలో ఉన్న మోడీని కలవడాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని మోడీకి చంద్రబాబు వంగి.. వంగి నమస్కారాలు పెట్టారంటూ వైసీపీ నేతలు విమర్శించడాన్ని అనిత తప్పుపట్టారు.
see also:చికాగో సెక్స్ రాకెట్ : స్టార్ హీరోయిన్స్ లిస్ట్ శ్రీరెడ్డి చేతిలో..!
మీలా మోడీ కాళ్లకు దండం పెట్టలేదు, మీలా కాళ్లు పట్టుకోలేదు. మీలా పీఎం కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరగలేదు అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి ఎమ్మెల్యే అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి నమస్కారం పెట్టినందుకే చంద్రబాబుకు ఒలంపిక్ మెడల్ ఇస్తామంటూ విమర్శిస్తున్నారే.. పాదయాత్రలో భాగంగా జగన్ ముద్దుల వర్షం కురిపిస్తున్నందుకు.. ఆయనకు ఏం మెడల్ ఇవ్వాలో మీరే చెప్పాలి అంటూ ఎమ్మెల్యే అనిత వ్యంగ్యంగా విమర్శించారు.
see also:అమెరికా సెక్స్ రాకెట్ లో హీరోయిన్ల పేర్లు లీక్..ముంబాయి ఏయిర్‌పోర్టులో హన్సిక వీడియో హల్ చల్