ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 193వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం పి.గన్నవరం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి లంకల గన్నవరం, మండెపులంక, కందలపాలెం మీదుగా నాగుల్లంక వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ఇక ప్రజలు తమ సమస్యలను జగన్ కు విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను విన్న వైఎస్ జగన్, భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
