ప్రయాణంలో, బజారులో పనిమీద వెళ్లినప్పుడు దాహం వేస్తే మినరల్ వాటర్ కొని తాగాల్సిందే. పరిశుభ్రంగా ఉండే నీటిని తాగడం మనకు అవసరమే. అయితే అలా బాటిల్స్‌ను కొనేటప్పుడు ఒక్క విషయాన్ని మాత్రం కచ్చితంగా గమనించాల్సిందే. ఎందుకంటే అది మన ఆరోగ్యానికి సంబంధించింది. ఇంతకీ ఏంటది..? అని అడగబోతున్నారా..? అయితే అదేమిటో మీరే చదివి తెలుసుకోండి.
see also:పద్మాసనము వలన కలిగే ఫలితాలు ఇవే..!!
ఏమీ లేదండీ… ఇకపై మీరు వాటర్ బాటిల్‌ను కొని తాగడానికి ముందు దాని కింద భాగాన్ని ఒకసారి చూడండి. ఏం కనిపిస్తాయి..? పరిశీలించారా..? అయితే జాగ్రత్తగా చూడండి..! PP, HDPE, HDP, PETE, PET, PVC, LDPE
see also:ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగ ముద్రలు..!!
అని ఏవైనా ఆంగ్ల అక్షరాలు కనిపిస్తున్నాయా అవును, కనిపిస్తాయి. ఇంతకీ అవి ఎందుకు ప్రింట్ చేయబడి ఉంటాయో తెలుసా ?ఆ వాటర్ బాటిల్ తయారు చేయబడిన ప్లాస్టిక్ పదార్ధం అది. అంటే… ఎన్నో రకాల ప్లాస్టిక్స్ ఉన్నాయి కదా వాటిలో ఏ తరహా ప్లాస్టిక్‌తో ఆ వాటర్ బాటిల్‌ను తయారు చేశారో తెలియజేస్తూ బాటిల్స్ కింద దానికి చెందిన లెటర్స్‌ను ప్రింట్ చేస్తారు. మరి వాటిలో మనకు ఏది సేఫో, ఏది హాని కలిగిస్తుందో కింద చూడండి
see also:భార్యతో బలవంతపు శృంగారం..అసహజ శృంగారం చేస్తే
PETE లేదా PET
*వాటర్ బాటిల్ కింద గనక ఈ లెటర్స్ ప్రింట్ చేయబడి ఉంటే జాగ్రత్త. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ తో తయారు చేసిన వాటర్ బాటిల్స్‌లో నీరు పోస్తే ఆ నీటిలోకి ప్రమాదకరమైన విష పదార్థాలు విడుదలవుతాయట. ఆ క్రమంలో ఆ నీటిని తాగడం మనకు మంచిది కాదట*
see also:వర్షాకాలంలో ఏ ఆహారం తినాలో తెలుసా..?
HDPE లేదా HDP
వాటర్ బాటిల్ కింద గనక ఈ లెటర్స్ ఉంటే అప్పుడు ఆ బాటిల్‌లోని నీటిని మనం నిరభ్యంతరంగా తాగవచ్చు. ఆ నీటిలోకి ఎలాంటి ప్లాస్టిక్ అవశేషాలు చేరవు. అవి పూర్తిగా సురక్షితమైనవి. మనకు ఎలాంటి హాని కలిగించవు
PVC లేదా 3V
ఈ లెటర్స్ వాటర్ బాటిల్స్ కింద ప్రింట్ చేయబడి ఉన్నా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వల్ల నీటిలోకి కొన్ని రకాల విష పదార్థాలు చేరతాయి. అవి మన శరీరంలో హార్మోన్ అసమతుల్యతను కలిగిస్తాయి
see also:నిమ్మకాయ తో ఎన్ని లాభలో..మీకు తెలుసా..!!
LDPE
ఈ ప్లాస్టిక్‌తో చేసిన వాటర్ బాటిల్స్ మనకు శ్రేయస్కరమే. వీటి నుంచి ఎలాంటి వ్యర్థాలు నీటిలోకి చేరవు. కానీ ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తయారీకి పనికిరాదు. ప్లాస్టిక్ బ్యాగ్స్ ను దీంతో చేస్తారు
PP
పెరుగు కప్పులు, టానిక్‌లు, సిరప్‌లు ఉంచేందుకు వాడే చిన్నపాటి బాటిల్స్‌ను తయారు చేసేందుకు ఈ ప్లాస్టిక్‌ను వాడుతారు. ఇది మనకు సురక్షితమే
PS
ఈ తరహా ప్లాస్టిక్‌తో కాఫీ, టీ కప్స్ తయారు చేస్తారు. అవి వాటిలోకి కార్సినోజెనిక్ సమ్మేళనాలను విడుదల చేస్తాయి. కనుక ఈ తరహా ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులను కూడా వాడకూడదు*
see also:మొటిమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
*లేబుల్ ఏం లేకపోయినా లేదా PC అని ఉన్నా… ఈ ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమైంది. దీంతో చేసిన ఏ ప్లాస్టిక్ నూ వాడకూడదు. చాలా ప్రమాదకరం. కానీ కొందరు ఈ ప్లాస్టిక్‌తోనే ఫుడ్ కంటెయినర్లు, వాటర్ బాటిల్స్‌ను తయారు చేస్తున్నారు. కనుక మీరు వాడుతున్న ప్లాస్టిక్ వస్తువులు దీంతో గనక తయారై ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.