టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వేధింపులు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో ప్రపంచానికి తెలిపేలా ఇటీవల కాలంలో శ్రీరెడ్డి అర్థనగ్న నిరసన చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు తగ్గే వరకు పోరాడుతానని శ్రీరెడ్డి చెప్పింది. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి మహిళా సంఘాలు సైతం మద్దతు తెలిపాయి. మరో పక్క జాతీయ మానవ హక్కుల సంఘం టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వేధింపులై విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
see also:ఫ్లాష్ న్యూస్ : మరో హీరోయిన్‌ను పట్టుకున్న అధికారులు..!
అయితే, జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ కొనసాగుతున్న క్రమంలోనే తాజాగా చికాగో సెక్స్ రాకెట్ భాగోతం వెలుగు చూసింది. దీంతో యావత్ సినీ ప్రపంచం అవాక్కైంది. ఈ నేపథ్యంలో సినీ మాటల, పాటల రచయిత్రి శ్రేష్ఠ క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టమని తెలిపింది. ఆ విషయం తనకు అనుభవం ద్వారా తెలిసిందని చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలో ఎవరూ తెలియకుండా, ఏ పరిచయాలు లేకుండా ధన, జన బలం లేకుండా కేవలం కళామ తల్లిని నమ్ముకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తనకు క్యాస్టింగ్ వేధింపులు ఎదురయ్యాయని తెలిపింది.
see also:అమెరికా సెక్స్ రాకెట్ లో కండోమ్స్ ను చూసి షాకైన అధికారులు..!
అందులో కొన్ని చెబుతూ.. ఓ మహిళా డైరెక్టర్ తన భర్త కోరిక తీర్చమని అడుగుతుంది. ఓ బఢా ప్రొడ్యూసర్ తనకు లొంగలేదని డబ్బులు ఇప్పించడంలో ఆలస్యం చేస్తాడు. మరొక డైరెక్టర్ ఫ్లాట్ కొనిస్తా.. వస్తావా..! పాటలు రాస్తూ ఎన్నాళ్లు బతుకుతావు అంటూ లైంగిక వేధింపులకు గురి చేస్తాడు అంటూ శ్రేష్ఠ చెప్పుకొచ్చింది. అయినా, ఆ వేధింపులను తట్టుకోలేకే రాత్రికి రాత్రే అన్నీ సర్దుకుని తన స్వగ్రామానికి వెళ్లినట్టు ఇంటర్వ్యూలో చెప్పింది శ్రేష్ఠ