ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేసిన సంగతి తెల్సిందే .తన రాజీనామా లేఖను ఈ రోజు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పంపారు .అంతే కాకుండా తన రాజీనామా లేఖను తక్షణమే ఆమోదించాలని కూడా ఈ సందర్భంగా పరకాల చంద్రబాబు నాయుడ్ని కోరారు .అయితే గత నాలుగు ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నందుకే రాజీనామా చేసినట్లు పరకాల తెలిపారు .
see also:చంద్రబాబు పై దుమ్ములేపుతున్న పాట..!!
అయితే పరకాల ప్రభాకర్ రాజీనామా చేయడానికి ప్రధాన కారణం వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు కాదు .గత కొంతకాలంగా బీజేపీ ,టీడీపీ పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ వైర్యమే కాకుండా ఇటివల ఎన్డీఏ కూటమి నుండి తప్పుకోవడం ..అంతే కాకుండా వచ్చే నెల జులై నెల మొదటి వారంలో పరకాల పదవీ కాలం ముగుస్తుండటంతో పరకాల రాజీనామా చేశారు అని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు .
see also:వై.ఎస్. జగన్‌పై మంత్రి దేవినేని ఉమా తిట్ల పురాణం..!
గత నాలుగు ఏండ్లుగా ఆ పదవీలో ఉంటూ ఇప్పుడు మరో పదిహేను రోజుల్లో పదవీ కాలం ముగుస్తుండటంతో రాజీనామా చేయడం టీడీపీ పార్టీ ఆడుతున్న మరో డ్రామా అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..
see also:ఎంత గొప్ప మనస్సు.. అనాథ అమ్మాయితో వ్యాపారి పెళ్లి..!!