ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు , ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ నోటి జారుడుతనం గురించి అందరికీ తెలిసిన విషయమే. నారా లోకేష్ ఏ సభలో పాల్గొన్నా.. ఆ సభకు అన్ని మీడియా ప్రతినిధులందరూ తప్పక హాజరవుతారు. ఎందుకంటే..? నారా లో కేష్ ఎప్పుడు నోరుజారుతాడా..! అన్నదానిపైనే కాన్సట్రేషన్ చేసేందుకన్నమాట.
see also:చంద్రబాబు నాయుడు పై.. వైఎస్ జగన్ సంచలనమైన ట్విట్
అందులో భాగంగానే వర్ధంతిని జయంతి, జయంతిని వర్ధంతి అని పలుకుతూ పలుమార్లు మీడియాకు చిక్కాడు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ ను దేశంగా, కంపెనీగాను వర్ణించిన ఘనత నారా లోకేష్‌కే దక్కింది. ఇలా నారా లోకేష్ పాల్గొన్న ప్రతీ కార్యక్రమం సెన్షేషన్ అవుతుంది.
see also:జగన్‌పై ఆరోపణలు…పదవికి పరకాల గుడ్ బై
ఇదిలా ఉండగా, ఇవాళ నారా లోకేష్ ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, వేదికపైకి ఆ గ్రామ సర్పంచ్‌ను పిలవకపోవలేదు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదికపైకి తనను ఎందుకు పిలవలేదని ఆ సర్పంచ్ మంత్రి లోకేష్‌పై ఫైరయ్యాడు. ప్రోటోకాల్ కూడా తెలియని నీవు.. మంత్రివా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే, పక్కనే ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆ సర్పంచ్‌ను సముదాయించి వేదికపైనుంచి కిందకు దించేశారు.