టీడీపీ నేతలు ఒకరిని మించి మరొకరు కామెడీలు చేయడంలో పోటీ పడుతున్నారని అంటున్నారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడైన మంత్రి లోకేష్‌ను చేసిన కామెంట్లే..అదే పార్టీలో ఉన్న `బీకాం ఫిజిక్స్` బ్రాండ్ అంబాసిడర్ జలీల్‌ఖాన్‌ను మించిపోయేలా ఉన్నాయనకుంటే..తాజాగా టీడీపీకి చెందిన ఓ నాయకుడి మాటలు ఇంతకుమించి ఉన్నాయంటున్నారు. ఆయన టీడీపీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ వీవీ చౌదరి.
see also:జగన్‌పై ఆరోపణలు…పదవికి పరకాల గుడ్ బై
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రకు వస్తున్న విశేష స్పందనను చూసిన సీఎం చంద్రబాబు దానిపై స్పందిస్తూ “జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్న సమయంలో నడుస్తున్నది నేను వేసిన రోడ్లపైనే“ అంటూ అర్థం లేని లాజిక్ తీశారు. అనంతరం ఆయన తనయుడైన మంత్రి లోకేష్ మాట్లాడుతూ `జగన్ పాదయాత్ర, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర టీడీపీ వేసిన రోడ్లపైనే“ అంటూ వ్యాఖ్యానించారు. తండ్రి కొడుకుల కామెంట్లపై వైసీపీ, జనసేన నేతలు సెటర్లు వేశారు. “సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చెప్తున్నట్లు ఆ రోడ్ల కోసం సొంత డబ్బులు ఖర్చుపెట్టారా? లేకపోతే వాళ్ల కంపెనీ అయిన హెరిటేజ్ నిధుల నుంచి రోడ్లేశారా? ప‌్రభుత్వ నిధుల నుంచే రోడ్లు వేసి టీడీపీ ఇలా ప్రచారం చేసుకోవడం ఏంటి?“ అంటూ పంచ్‌లు వేశారు. అయినప్పటికీ టీడీపీ నేతల జోకులు ఆగడం లేదు.
see also:ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయం.. మాజీ ఎంపీ సంచలన వాఖ్యలు
తాజాగా గుంటూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీ వీవీ చౌదరి మాట్లాడుతూ “ప్రతిపక్ష నాయకుడు జగన్ తన పాదయాత్రలో నడిచే రోడ్డు తెలుగుదేశం ప్రభుత్వం వేసిందే. జగన్ త్రాగే నీరు ఎన్‌టీఆర్ జలసిరితో తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్నవే. పాదయాత్రలో జగన్ చూసే ప్రతి బిల్డింగ్ చంద్రబాబు నాయుడు అధ్యర్వంలో కట్టించిన ఎన్టీఆర్ గృహాలే“ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇద్దరు ముఖ్యనేతలకు పంచ్‌లు పడినప్పటికీ…ఆ పార్టీకి చెందిన నాయకుల కామెడీలు ఆగడం లేదని….అవి బీకాం ఫిజిక్స్‌ను మించిపోతున్నాయని పలువురు నవ్వుకుంటున్నారు.