వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యత్ర తూర్పు గోదావరి జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, జగన్ పాదయాత్ర ఇప్పటి వరకు ఏపీలోని పది జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఇవాళ 193వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. పీ.గన్నవరం మీదుగా ప్రారంభమై లంకల గన్నవరం నుంచి మండెపులంక, కందలపాలెం, నాగుల్లంక వరకు జగన్ ఇవాళ పాదయాత్ర చేయనున్నారు.
see also:ఉరవకొండలో ఉద్రిక్తత..!!
ఇదిలా ఉండగా, సోమవారం జరిగిన ఓ సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది. చక్కగా చదువుకుంటున్న లక్ష్మీ పద్మ అనే పదవ తరగతి విద్యార్థిని ఒక్కసారిగా మంచాన పడింది. ఊహించని కష్టం ఆ నిరుపేద కుటుంబాన్ని కుదిపేసింది. కూతూరిని చూసుకోవాలో.. కూలీపనికి వెళ్లాలో తెలియని ఆయోమయ స్థితి ఆ తల్లిది. నడవలేని స్థితిలో తన బిడ్డను తీసుకుని పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలిసింది.
see also;సంచలన వాఖ్యలు చేసిన పురందేశ్వరి..!!
ఆ చిన్నారిని చూసిన జగన్ ఒక్కసారిగా చలించి పోయారు. బడికి వెళ్లి చదువుకోవాల్సిన సమయంలో ఇలా మంచాన పడిందని తెలుసుకున్న జగన్ కన్నీటి పర్యంత మయ్యారు. జగనన్నా… సాయం చేయండి అంటూ లేఖ రాసింది. వెంటనే స్పందించిన జగన్ మీకు అందాల్సిన సాయం త్వరలోనే అందుతుంది, ధైర్యంగా ఉండాలని భరోసం కల్పించారు. జగన్ చేస్తున్న పాదయాత్రలో కల్లు తడిచే ఇలాంటి కథలు ఎన్నో.. అంటున్నారు జగన్ వెంట నడుస్తున్న ప్రజలు.