సెక్స్ రాకెట్ ఎఫెక్ట్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూఎస్‌కు వెళుతున్న తెలుగు స్టార్‌లను అక్కడి అధికారులు ఎయిర్‌పోర్టులోనే నిలిపి విచారణ జరుపుతున్నారు. అలాంటి అనుభవమే హీరోయిన్ మెహ్రీన్‌కు ఎదురైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ జాబితాలో సౌత్ సినీ ఇండస్ట్రీ హాట్ బ్యూటీ హన్సిక కూడా చేరిపోయింది. మెహ్రీన్‌ను చికాగో పోలీసులు విచారిస్తే.. హన్సికను ముంబై పోలీసులు విచారించారు. చికాగో సెక్స్ రాకెట్‌పై హన్సికను ఆరా తీశారు.
అయితే, అధికారుల విచారణ పూర్తికాగానే హన్సిక మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినీ నిర్మాత అమెరికాలో అరెస్టైనట్లు అధికారులు చెప్పే వరకు తనకు తెలియదని తెలిపింది. ఇలాంటి విచారణ గతంలో తానెప్పుడూ ఎదుర్కోలేదని చెప్పింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు తానెంతో ఇబ్బంది పడ్డానని ఆవేదన వ్యక్తం ఏసింది. ఒకరు తప్పు చేస్తే మొత్తం ఇండస్ట్రీకే ఆపాదించడం సరికాదని, తనను అరగంటపాటు విచారించడం చాలా బాధ కలిగించిందని హన్సిక కన్నీరుమున్నీరైంది.