ఏపీ లోని విశాఖపట్నం జిల్లా పాయకరావు పేటకు చెందిన వెంకట సత్యానారాయణ(చిన్నా)కు ఆస్తి, అంతస్తులు బాగానే వున్నాయి. తను పెళ్లి చేసుకుంటానంటే లక్షల్లో కట్నాలు ఇచ్చే అమ్మాయిలు రెడీగా ఉన్నారు. కానీ చిన్నా వారిని కాదని పద్మ అనే అనాథ యువతిని వివాహం చేసుకోవటానికి ముందుకొచ్చాడు.
see also:వై.ఎస్. జగన్‌పై మంత్రి దేవినేని ఉమా తిట్ల పురాణం..!
పద్మ విశాఖపట్నంలోని ప్రేమసమాజంలో ఉంటుంది.అయితే ఆమె తల్లిదండ్రులుఐదేళ్ళ వయసులోనే మరణించారు. పద్మ తో పాటు పద్మ అన్నయ లక్ష్మణ్ కూడా ప్రేమసమాజంలోనే పెరిగి పెద్దయ్యారు.ప్రస్తుతం పద్మ ఇంటర్ చదువుకుంది.ఈ క్రమంలోనే చిన్నాకు ఆమెకు గురించి తెలిసింది. తన తల్లిదండ్రులను,, అక్కాచెళ్ళెళ్లను బాగా చూసుకునే కోడలు కావాలనుకున్నాడు. పద్మను చూశాక ఆమెనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు చిన్నా.
see also:పరకాల రాజీనామా..అడ్డంగా బుక్కయిన బాబు
అందులోభాగంగానే అనాథ పిల్లల మధ్య ఈనెల 21న ఉదయం 10.59 గంటలకు వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. వీరి పెళ్ళికి ప్రేమసమాజం అన్నపూర్ణ ఆడిటోరియం వేదిక కానుంది. పద్మను కన్యాదానం చేయటానికి కనకమహాలక్ష్మి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఉప్పల భాస్కరరావు, వరాహలక్ష్మి దంపతులు ముందుకు వచ్చారు.