రైతు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు .ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..రైతుబంధు తో రైతులందరు సంతోషంగా ఉన్నారని చెప్పారు.త్వరలోనే కోటి ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు ఇస్తామన్నారు.ఆగష్టు 15 నుంచి రైతు బంధు జీవిత భీమా పథకం అమలులోకి వస్తుందనిఅన్నారు . ఈ పథకం కింద 50 లక్షల మందికి ప్రభుత్వం 1100 కోట్ల ప్రీమియం చెల్లిస్తుందన్నారు. ఈ నెలాఖరులోగా రైతులకు ఇచ్చిన ఫారమ్‌లో నామిని పేరు రాసి వ్యవసాయ శాఖ అధికారులకు ఇవ్వాలని సూచించారు.
