Home / SLIDER / ప‌సుపు రైతుల సంక్షేమం కోసం ఎంపీ క‌విత వినూత్న కార్యాచ‌ర‌ణ‌

ప‌సుపు రైతుల సంక్షేమం కోసం ఎంపీ క‌విత వినూత్న కార్యాచ‌ర‌ణ‌

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప‌సుపు రైతుల సంక్షేమం కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సోమవారం హైదరాబాద్ లో సుగంధ ద్రవ్యాల బోర్డ్ (స్పై సెస్ బోర్డ్) పసుపు పై వర్క్ షాప్ నిర్వహించింది. ఈ కార్య్రమానికి ఎంపి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపి కవిత మాట్లాడుతూ పసుపు సాగును లాభసాటిగా మారుస్తామన్నారు. కేంద్రం పసుపు ప్రత్యేక సెల్ ను  ఏర్పాటు చేస్తోందని, దీనికోసం కార్యాచరణ  రూపొందించడం లో భాగంగా వర్క్ షాప్ ను నిర్వహించినట్లు చెప్పారు.  పసుపు కు కనీస మద్దతు ధరను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పసుపుపై వర్క్ షాప్ నిర్వహణకు సహకరించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభుకు కృతజ్ఞతలు తెలిపారు.

see also:అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది..ప్రధాని మోదీ

మూడు దశాబ్దాలుగా పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని పసుపు రైతులు డిమాండ్ చేస్తున్నారని కవిత చెప్పారు. రైతులను ఆదుకునేందుకు తాను ఎంపి అయ్యాక లోక్ సభ లోనూ పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ప్రధానితో పాటు కేంద్ర వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల మంత్రులను కలిశానని, ఐదుగురు ముఖ్య మంత్రులు పసుపు బోర్డ్ ఏర్పాటుకు మద్దతుగా లేఖలు కూడా ఇచ్చిన విషయాన్ని కవిత వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా విషయాన్ని తెలిపారు.పసుపు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పార నీ ఇందులో భాగంగానే పసుపు పై వర్క్ షాప్ ను నిర్వహిస్తోందని కవిత చెప్పారు. రబ్బర్, సిల్క్ కు బోర్డు ఏర్పాటు చేసిన విధంగానే పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల పసుపు రైతులకు మేలు జరుగుతుందని ఎంపి కవిత స్పష్టం చేశారు.

see also:ద‌శాబ్దాల భూ వివాదాల‌కు ప‌రిష్కారం….మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం

బాల్కొండ నియోజక వర్గంలో వేల్పూర్ లో రాష్ట్ర ప్రభుత్వం  42 ఎకరాల స్థలాన్ని కేటాయించి, రూ. 30 కోట్ల ను మంజూరు చేసిందని ఎంపీ క‌విత  చెప్పారు. జీన్ బ్యాంక్ ఏర్పాటు చెయ్యా ల్సిన అవసరం ఉందని, ఉడకబెట్టిన పసుపు ఎండబెట్టేందుకు యంత్రాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయో అధ్యయనం చేయాలని ఎంపి కవిత సూచించారు. పసుపు వంగడాలు ఎంపిక, సాగులో యాజమాన్య పద్ధతులు ధరలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ మెళకువలు తదితర అంశాలపై రైతులకు, అధికారులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. పంట ఉత్పాదకత పెంపుతో పాటు ఎగుమతిపై అనుసరించాల్సిన వ్యూహంపై వర్క్ షాప్ లో చర్చించినట్లు ఎంపి కవిత తెలిపారు.

see also:అన్న‌దాత‌ల సంక్షేమం కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌

1990 లో 7 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి కాగా నేడు 3లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింద నీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణాలను  అన్వేషించాలన్నారు. 6 శాతం మాత్రమే పసుపు ఎగుమతి జరుగుతున్నవని, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పసుపు భారతీయ సంప్రదాయంలో భాగమన్నారు. పసుపు ను వంటల్లో ఉపయోగించడం కాకుండా ఔషధ గుణాలు కలిగి ఉంటుందని ఎంపి కవిత వివరించారు. ఆర్మూర్, బోధన్ ఎమ్మెల్యేలు ఆశన్న గారి జీవన్ రెడ్డి, షకీల్ ఆమిర్, టిఆర్ఎస్ జగిత్యాల ఇంచార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్,  వర్క్ షాప్ లో పాల్గొని  పసుపు రైతుల మేలు కోసం ఎంపి కల్వకుంట్ల కవిత చేస్తున్న కృషిని వివరించారు.  వర్క్ షాప్ లో రైతులు, ట్రేడర్లు, సైంటిస్టులు, అధికారులు ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. పలు అంశాలపై నిపుణులు సందేహ నివృత్తి చేస్తూ పసుపు ఉత్పాదకత పెంపు, సాగులో మెళకువలు, మార్కెట్ స్ట్రాటజీ పై అవగాహన కల్పించారు.

see also:రైతులకు కనీస మద్ధతు ధర..కేంద్రానికి మంత్రి హ‌రీశ్ లేఖ‌

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat