ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు సంబంధించిన ఆర్జీ ఫ్లాష్ టీం ఒక సర్వే చేసింది.
see also:వైఎస్ఆర్ కోసం తూర్పుగోదావరి జిల్లా ప్రజలు..!!
ఆ సర్వేలో అధికార టీడీపీ పార్టీకి నూట పది స్థానాలు వస్తాయి.ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి అరవై స్థానాలు వస్తాయి.ఇతరులకు ఐదు స్థానాలు వస్తాయి అని తేలింది అని సదరు న్యూస్ ఛానల్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.ఈ క్రమంలో తనకు సంబంధించిన ఒక బృందం ఏపీలో సర్వే చేసిందని ..అందులో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పార్టీనే మరల అధికారంలోకి వస్తుంది ..
see also:నీరు-చెట్టు,హౌజింగ్ స్కీం పథకాల్లో 30000కోట్ల అవినీతి ..!
వైసీపీ పార్టీకి అరవై స్థానాలు వస్తాయి అని తేలిన సర్వే గురించి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పందించారు అని ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ వార్తల కథనం ప్రకారం మాజీ ఎంపీ లగడపాటి మాట్లాడుతూ తను కానీ తనకు సంబంధించిన బృందం కానీ ఎటువంటి సర్వేలు చేయలేదు.మేము సర్వే చేస్తున్నట్లు కథనాలు అవాస్తవం .అందులో ఎంత మాత్రం నిజం లేదు ..