వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు జనాదరణ పెరుగుతోందా..? గుంటూరు, కృష్ణా జిల్లాలతో పోల్చితే గోదావరి జిల్లాల్లోనే వైఎస్ జగన్ పాదయాత్రకు జగన్ నుంచి మంచి స్పందన లభిస్తోందా..? వైఎస్ఆర్‌సీపీ ఇమేజ్ గ్రాఫ్ పెరుగుతుందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇస్తున్న నివేదికలు అధికార టీడీపీలో గుబులు రేపుతున్నాయా..? ఢిల్లీ పర్యటన ముగించుకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ఏం చెప్పింది..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే మరీ..!
see also:అదిగో వైఎస్ జగన్ ..ప్రతి వైసీపీ అభిమాని..షేర్లు కొట్టండి ..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, జగన్ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు జగన్‌ను కలుసుకుని తమకు చంద్రబాబు సర్కార్ ఇప్పటి వరకు రుణాలు మాఫీ చేయలేదని, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు తమను మోసం చేశాడని నిరుద్యోగులు, జన్మభూమి కమిటీలు పింఛన్లలోనూ కమీషన్లు దండుకుంటున్నారని వృద్ధులు ఇలా ప్రతీ ఒక్కరు జగన్‌ను కలుసుకుని వారి సమస్యలను చెప్పుకుంటున్నారు.
see also:పచ్చబ్యాచ్‌కు దిమ్మ తిరిగేలా.. సామాన్యుడి 10 ప్రశ్నలు..!
అయితే, ఇటీవల నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లి తిరిగి వచ్చిన చంద్రబాబుకు ఏపీ ఇంటెలిజెన్స్ నివేదిక బిగ్ షాక్ ఇచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉభయ గోదావరి జిల్లా ప్రజలే ఇందుకు కారణమట. ఇక అసలు విషయానికొస్తే.. తమకు బాగా పట్టు ఉన్న ప్రాంతాలుగా గుంటూరు, కృష్ణా జిల్లాలని టీడీపీ భావిస్తోంది. ఆ రెండు జిల్లాల్లో జగన్ పాదయాత్రకు వచ్చిన స్పందన అంతంత మాత్రమేనని టీడీపీ భావించింది. అంతేకాకుండా, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ జగన్ పాదయాత్రను ఎవ్వరూ పట్టించుకోరని భావించిన టీడీపీ శ్రేణులకు ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ చూసిన కళ్లు బయర్లు కమ్మాయట. ఇప్పటి వరకు జగన్ పాదయాత్ర గ్రాఫిక్స్‌మయం అని బుకాయించిన చంద్రబాబు ఆ రిపోర్ట్ చూడగానే వాస్తవ లోకానికి వచ్చినట్టు టీడీపీ శ్రేణులే చెబుతున్నారు.