ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఏబీఎన్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కి చెందిన ఆర్ జీ ఫ్లాష్ టీం అనే ఒక బృందం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేసింది.ఈ సర్వేలో ప్ర్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీ నూట పది ..ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ అరవై ..ఇతరులు ఐదు స్థానాల్లో గెలుపొందుతారు అని తేలింది ఫలితాలను నిన్న సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం చేసిన సంగతి తెల్సిందే .
see also:వైసీపీ అధినేత జగన్ కు “జై”కొట్టిన 51.21%శాతం మంది ..!
అయితే ఈ సర్వేలో వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు లేదని తేలిందని ఆ ఛానల్ ఒక కథనాన్ని ప్రచురించింది .ఈ క్రమంలో రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున నిలబడిన పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి(49.78శాతంతో 78,547ఓట్లు) ,టీడీపీ తరపున నిలబడిన పుత్తా నరసింహారెడ్డి(46.39శాతంతో 73,202ఓట్లు)పై ఐదు వేల మూడు వందల నలబై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
see also:వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి..!
అయితే తాజాగా ఆర్ జీ ఫ్లాష్ టీం నిర్వహించిన సర్వేలో కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే వైసీపీ పార్టీ తరపున నిలబడే అభ్యర్థికి 44.48శాతం ..టీడీపీ అభ్యర్థికి 39.55శాతం ఓట్లు మాత్రమే వస్తాయి .అయితే వైసీపీ తరపున ఎవరు నిలబడిన కానీ ఈ నియోజకవర్గంలో ఎదురులేకుండా గెలుస్తారు అని ఈ సర్వే తేల్చేసింది .