ఒకప్పుడు ఎంతో అన్యోన్యయంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణూదేశాయ్ లు ఏవో కొన్ని అనివార్య కారణాల వలన విడిపోయారు. రేణూ నుండి విడిపోయిన పవన్ అన్నా లెజీనావోని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చాడు. కాని రేణూ మాత్రం పెళ్లి జోలికి వెళ్లకుండా తన ఇద్దరి పిల్లలని చూసుకుంటూ కాలం గడుపుతుంది. అయితే ఆ మధ్య తనికి ఓ తోడు కావాలని, అందుకోసం మంచి వ్యక్తిని చేసుకోవాలని భావిస్తున్నానని రేణూ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే రేణూ దేశాయ్ వివాహం చేసుకోబుతున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు విశేష ప్రచారం లభిస్తోంది.
see also:సెక్స్ రాకెట్‌లో దొరికిన హీరోయిన్లు వీరే..!
ఆమె సోషల్ మీడియాలో చేసిన కొన్ని వ్యాఖ్యలు,వ్యక్తి వ్యక్తం చేసిన బావోద్వేగం నేపద్యంలో ఆమె ఒక వ్యక్తిని పెళ్లాడబోతున్నారని భావిస్తున్నారు.రేణు సోషల్‌మీడియా వేదికగా శనివారం ఓ వ్యక్తి చేయిపట్టుకుని దిగిన ఫొటోను పంచుకున్నారు. దీంతో పాటు తను ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికా అంటూ కవిత రాశారు. ఈ ప్రయాణంలో ప్రేమ అనేది ఓ అనుభూతి అన్న సంగతిని మర్చిపోయానని ఆమె అన్నారు. ‘నీలో నా ప్రేమ దొరికింది’ అంటూ ఓ వ్యక్తి గురించి పేర్కొన్నారు. అతనితో ఉంటే సంతోషంగా,శాంతంగా ఉంటానని ఆమె అబిప్రాయపడ్డారు. ఆ నమ్మకాన్ని ఆయన కలిగించారని కూడా పేర్కొన్నారు. ఈ కవిత్వం ఆదారంగా ఆమెకు అతనే కాబోయే భర్త ఇతనే అని బావిస్తున్నారు. అయితే ఆమె మాత్రం ఆ వ్యక్తి ఎవరో స్పష్టత ఇవ్వకుండా రాయడం విశేషం. కాగా, ఈ కవితపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ‘నిజమైన ప్రేమ గురించి ఎంత బాగా వర్ణించారు.. మాటల్లేవు’,‘మీ భవిష్యత్ జీవితానికి ఆల్ ది బెస్ట్’, ‘మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమించే వ్యక్తి దొరికారని అనుకుంటున్నా’ అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.