పవిత్ర రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదరులకు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. హిందూ, ముస్లింల ఐక్యతకు, గంగా, జమునా తెహజీబ్ సంస్కృతికి తెలంగాణ ఆలవాలంగా నిలుస్తోందన్నారు.
see also:డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్..!!
దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్కారు మైనారిటీల అభివృద్ధికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందన్నారు. రంజాన్ ను రాష్ట్ర పండుగగా గుర్తించి పెద్ద ఎత్తున ప్రభుత్వమే ముస్లిం సోదరులకు ఇఫ్తార్ పార్టీ ఇస్తోందన్నారు. రంజాన్ పండగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబంలో కూడా పండగ సంతోషం నెలకొనాలని దుస్తులు ఉచితంగా ఇస్తోందన్నారు. మసీదులలో పండగ వాతావరణం కనిపించేలా వాటి పునరుద్ధరణ, అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
see also:మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లీయర్..!!
మైనారిటీల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీల కోసం 204 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. ఈరోజు మైనారిటీ గురుకులాల్లో సీట్లకు మంచి డిమాండ్ ఏర్పడిందన్నారు.
పేదింటి ముస్లిం కుటుంబంలో ఆడపిల్ల పెళ్లికి షాది ముబారక్ పథకం ద్వారా 1,00,116 రూపాయలను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు.
see also:మంత్రి కేటీఆర్‌కు జర్మనీ సంస్థ ఆహ్వానం..!!
ముల్లాలకు గౌరవ వేతనాలు, ముస్లింలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ తెలంగాణా లోని ముస్లింలు దేశంలో సగర్వంగా తల ఎత్తుకొని జీవించేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.