అనంతపురంలో మంత్రి పరిటాల సునీత హత్యలు, కిడ్నాప్‌లను ప్రోత్సహిస్తున్నారని రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో 10 క్రిమినల్ గ్యాంగ్స్ ఏర్పాటు అయ్యాయని పేర్కొన్నారు. పరిటాల కుటుంబానికి చట్టాలు వర్తించవా? అని ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. పరిటాల వర్గీయులు విచ్చలవిడిగా నేరాలు చేస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
see also:ఏపీకి పట్టిన దౌర్భాగ్యం.. వైఎస్ జగన్..!
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మంత్రి పరిటాల సునీతను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ.. టీడీపీ నేతల గూండాగిరికి పోలీసులు వత్తాసు పలకడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై ఉన్న కేసుల్లో సరైన విచారణ జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. వారిపై ఆలస్యంగా ఛార్జిషీట్లు నమోదు చేసి శిక్షలు పడకుండా పోలీసులు సహకరిస్తున్నారని కృష్ణప్ప ధ్వజమెత్తారు.
see also:కర్నూల్ జిల్లాలోని నంద్యాల చెక్‌పోస్టు దగ్గర దారుణ హత్య