పూర్వం యోగాచార్యులు శ్వాసగతినిబట్టి ఎన్నేళ్లు బతుకుతామన్నది చెప్పేవారు. ఎక్కువ శ్వాస.. తక్కువ ఆయుర్ధాయం, తక్కువ శ్వాస.. ఎక్కువ ఆయుర్ధాయం ఇదో కొలమానం. నిమిషానికి 32 సార్లు శ్వాసించే కోతి మహా అయితే పది సంవత్సరాలు జీవిస్తుంది. నమిషానికి నాలుగైదు సార్లు శ్వాసించే తాబేలు నిక్షేపంగా వేయి నుంచి రెండు వేల సంవత్సరాల వరకు బతుకుతుంది. మన ఆయుష్షు మన శ్వాసల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రతీ మనిషి నిమిషానికి 15 సార్లు శ్వాస తీసుకుని వదులుతాడట. అంతకన్నా తక్కువ శ్వాసించే వారు ఎక్కువకాలం బతుకుతారని చెబుతారు యోగా నిపుణులు.
శ్వాస గతికి, మానసిక స్థితికి సంబందం ఉంది. హాయిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస తగ్గుతుంది. కోపంతో, అసహనంతో ఉన్నప్పుడు శ్వాస పెరుగుతుంది. ఈ ఆధునిక జీవితంలో కోపతాపాలు సహజంగా మారాయి. ఈ నేపథ్యంలోనే శ్వాస తీసుకునే సమయం కూడా పెరిగింది. దీంతో ఆయుష్షు తరిగిపోతూ ఉంటుంది. ఉరుకులు పరుగులు లేని రోజుల్లో మనిషి 10 నుంచి 12 సార్లు శ్వాసించే వారని యోగాచార్యులు చెబుతుంటారు. అదే మానవుని అసలు సిసలైన శ్వాస. దాని ప్రకారంగా మనిషి జీవిత కాలం వంద ఏళ్లు. ప్రస్తుత కాలంలో ఒత్తిళ్లతో, అభద్రతాభావంతో, అసంతృప్తితో మానవుడు శ్వాస తీసుకునే సంఖ్య నిమిషానికి 20 దాటుతోంది.
శరీర బరువు పెరిగినప్పుడు ఏర్పడే కోటాను కోట్ల కణాల కోసం శ్వాస ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. గుండె వేగం పెరుగుతుంది. ఫలితంగా శరీరం అస్తవ్యస్తమవుతుంది. అందుకే అధిక బరువు, స్థూలకాయ సమస్యలు ఉన్న వారికి మధుమేహం, జీర్ణ వ్యవస్థ, శ్వాసకో, అధిక రక్తపోటు వ్యాధులు చుట్టుముడతాయి. అయితే, బరువును నియంత్రిం చేందుకు యోగా, ప్రాణాయామం మంచి ఫలితాలను చూపిస్తుంది.