నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. తల్లిదండ్రల ముందే కన్న కొడుకు క్షణాల్లో మరణించడం వారిని షాక్ గురిచేసింది. తానెక్కిన రైల్లో తల్లిదండ్రులు ఎక్కలేకపోవడంతో కదులుతున్న రైల్లోంచి దిగే ప్రయత్నంలో కన్నవారి కళ్ల ముందే ఓ యువకుడు కాలు జారి రైలు క్రింద పడి ముక్కలు,ముక్కలు అయిపోయాడు .పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట పట్టణంలో శ్రీనివాసరావు,నగరత్నమ్మ దంపతులకు ఇద్దరూ కుమారులు..చిన్నకుమారుడు సాయిచంద్(14) 9వ తరగతి చవుతున్నాడు. శుక్రవారం నెల్లూరులో జరుగుతున్న బాబాయ్ వివాహానికి హాజరయ్యేందుకు తల్లిందండ్రులతో కలిసి బయలుదేరాడు. రైల్వేస్టేషన్ చేరుకున్న వారికి ప్లాట్‌ఫాం నుంచి అప్పుడే బయలుదేరుతున్న మెమూ రైలును చూసి తల్లిదండ్రులు హడావుడిగా ఆ యువకుడిని రైలు ఎక్కించి, వారు కూడా ఎక్కే ప్రయత్నం చేసి ఎక్కలేకపోయారు. కానీ తల్లిదండ్రులు రైలు ఎక్కలేకపోవడంతో ఈ యువకుడు రైలు నుంచి కిందికి దిగే ప్రయత్నంలో ప్లాట్‌ఫాం, మెమూ రైలు మధ్యలో ఇరుక్కుపోయి తల, మొండెం వేరై తిరిగిరాని లోకానికి చేరుకున్నాడు. క్షణాల్లో జరిగిన ఈ దుర్ఘటనతో తల్లిదండ్రులతో పాటు ప్రయాణికులు విషాదంలో మునిగిపోయారు.కళ్ళ ఎదుటే బిడ్డ శరీరం ముక్కలు అయిపోవడం చూసి తలిదండ్రులు కుప్పకూలిపోయారు. రైల్వే ట్రాక్‌పై తల, మొండెం వేరై రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న బిడ్డను చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించిన ఘటన అక్కడ ఉన్న వారి కంటిలో కూడ నీళ్లు తెప్పించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.మృతుదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు…
