ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్ ముబారక్) తెలిపారు.
see also:వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు..!
రంజాన్ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని చెప్పారు. నెలరోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి రంజాన్ ఒక ముగింపు వేడుక కాగా, ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన పేర్కొన్నారు.
see also;కర్నూల్ జిల్లాలోని నంద్యాల చెక్‌పోస్టు దగ్గర దారుణ హత్య
పవిత్ర రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, సర్వమత సమత్వానికి, దాతృత్వానికి ప్రతీక. తెలుగురాష్ట్రాల ప్రజలందరికీ శుభసంతోషాలు కలగాలని, ఆ అల్లాహ్ చల్లని దీవెనలు నిరంతరం ఉండాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు అని అన్నారు.
see also:మహానటి పాత్రలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ..!