హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.. 2009 ఎన్నికల్లో విజయం సాధించిన అబ్దుల్ ఘని… 2014 ఎన్నికల్లో మాత్రం తన స్థానాన్ని బాలకృష్ణకు వదిలేశారు.. బాలయ్య అక్కడ పోటీ చేయడం వల్ల ఆయనకు పోటీచేసే అవకాశం రాలేదు..దానికి బదులుగా తనకు సముచితమైన పదవి ఇస్తుందని ఘని ఆశపడ్డారు.. నాలుగేళ్లు గడిచాయి.. ఇప్పటి వరకు ఘనికి ఎలాంటి పదవి దక్కలేదు.. తెలుగు తమ్ముళ్లు కనీసం ఆయన గురించి పట్టించుకోవడం కూడా మానేశారట! గత ఎన్నికల్లో బాలకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేయకపోయి ఉంటే అబ్దుల్ ఘని రెండోసారి ఎమ్మెల్యే అయ్యేవారు.. అదృష్టం కలిసివస్తే మంత్రి పదవి కూడా దక్కేది.. ఎందుకంటే టీడీపీ తరఫున ఆ ఎన్నికల్లో ఒక్క మైనారిటీ కూడా గెలవలేద కాబట్టి! మైనారిటీ కోటాలో ఘని మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవి..మరి అలాంటి రాజకీయ నేతను పక్కనపెట్టడంతో..ఈ మధ్యన ఘని పార్టీ మారుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అంతేకాదు జిల్లాలోని కొందరు వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిగాయాని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. చూడలి మరి టీడీపీ టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టబొతుందో వైసీపీ పార్టీ.
