పెళ్లైన ప్రతి పురుషుడు మండూకాసనం గురించి తెలుసుకోవాలని చెబుతున్నారు యోగా నిపుణులు. మండూకం అనగా కప్ప అని అర్థం. ఈ ఆసనం వేసే సమయంలో మన ఆకారం కప్పను పోలి ఉంటుంది కనుక ఈ ఆసనానికి మండూకాసనం అని పేరు వచ్చింది. మండూకాసనం వేసే విధానం, దాని వలన కలిగే ఉపయోగాలను యోగా నిపుణులు కింది విధంగా చెప్పుకొచ్చారు.
మోకాళ్ల మీద కూర్చొని తొడలను బాగా ఎడం చేసి రెండు అరికాళ్ల వేళ్లను వెనుకవైపు కలిపి ఉంచాలి. తరువాత చేతులను తొడల కిందకు చేర్చి నేలకు ఆనించి ఉంచాలి. ఇలా చేయడం వలన ముందుకు వంగినట్టు కనపడుతుంది. ప్రారంభంలో ఈ ఆసనాన్ని 25 సెకండ్లపాటు చేస్తూ నిదానంగా సమయాన్ని ఐదు నిమిషాల వరకు పెంచుతూ ఉండాలి.
ఈ ఆసనం వేయడం వలన శరీర బరువు ఎక్కువగా ఉన్న వాళ్లకు ఎంతో మేలు కలుగుతుంది. రెండు వారాల్లోగా బరువు తగ్గుతారు. అలాగే, జీర్ణశక్తిని పెంచుతుంది. చేతుల కండరాలు శక్తివంతమవుతాయి. నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు పటాపంచలవుతాయి. ఇస్తీరియా, ఆస్మా వ్యాధులను అరికడుతుంది. శరీరంలోని కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది. అలాగే, పురుషులలో లైంగిక పటుత్వాన్ని బాగా పెంచుతుంది. స్ర్తీల గర్భాశయ లోపాలను కూడా సవరిస్తుంది.