వృక్ష భంగిమను రోజూ చేయటం వల్ల శక్తి పుంచుకోవడంతోపాటు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ భంగిమలో లోతైన శ్వాసను తీసుకుని ముక్కు ద్వారా వదలటం ద్వారా ఊపిరి తిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఈ యోగాసనాన్ని ఎలా చేయాలంటే..
రెండు కాళ్లను తాకిస్తూ నిటారుగా నిలబడాలి. తరువాత కుడికాలును పైకెత్తి.. పాదాన్ని నెమ్మదిగా ఎడమకాలి తొడ వద్ద ఉంచాలి. ఇలా అనుసరించే క్రమంలో మీ రెండు చేతులను పైకెత్తి నమస్కార భంగిమలో ఉంచండి. ఇలా కొన్ని నిమిషాలపాటు నిలబడి లోతైన శ్వాసను తీసుకుని వదలాలి. తిరిగి సాధారణ స్థితికి వచ్చాక ఎడమ కాలితో కూడా ఈ విధానాన్ని అనుసరించాలి. ఈ ఆసనాన్ని రోజూ చేయడం వల్ల రక్త పీడనాన్ని అదుపులో ఉంచడంతోపాటు శ్వాస వ్యవస్థ, శరీరంఫిట్‌గా కూడా ఉంటుంది.