అమెరికా, చాలా మందికి ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్. చదువు, ఉద్యోగం, వ్యాపారం ఇలా అనేక రంగాల్లో రాణించాలనే భారతీయులు, తెలుగు వారు అమెరికా వెళ్లాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. కానీ, అక్కడకు వెళ్లిన కొందరు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అన్ని చోట్లా అడ్డదారులు తొక్కే వారు ఉన్నట్టుగానే అమెరికాలోని తెలుగు వారు కూడా మొత్తం తెలుగు వారికే మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని తెలుగు సంఘాలకు కో ఆర్డినేటర్లుగా పని చేస్తున్న ఓ జంట చేసిన పని అంతా అవాక్కయ్యేలా చేసింది. మోదుగుమూడి కిషన్, అతని భార్య చంద్రకళ కలిసి చేసిన పని ప్రస్తుతం సంచలన సృష్టిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా కొన్నేళ్లపాటు భూతుబాగోతాన్ని నడిపించిన ఈ జంట ప్రస్తుతం అమెరికా జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. టాలీవుడ్‌లోని పలు సినిమాలకు మోదుగుమూడి కిషన్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించినట్టు సమాచారం.
see also:అమెరికా సెక్స్ రాకెట్ లో టాప్ హీరోలందరి పక్కన నటించిన హీరోయిన్
మోదుగుమూడి కిషన్ సినీ ఇండస్ట్రీలో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని ఈ సెక్స్ రాకెట్‌ను నడిపించారని షికాగో పోలీసులు తెలిపారు. సినీ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాని హీరోయిన్లకు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు డబ్బును వలగా వేసి వ్యభిచార ఊబిలోకి దింపారు. అమెరికాలోని తెలుగు సంఘాలకు అమ్మాయిలను సప్లై చేసే కో ఆర్డినేటర్లుగా ఆ జంట వ్యవహరించింది. యువతులకు టెంపరరీ వీసాలు ఏర్పాటు చేసి అమెరికాకు రప్పించినట్టు పోలీసుల విచారణలో తేలింది.
see also:ఆమెరికా సెక్స్ రాకెట్ లో చిక్కిన తెలుగు టాప్ హీరోయిన్లలో ఒకరు..ఇండస్ట్రీ షాక్
ఇక అసలు విషయానికొస్తే.. ఈ వ్యవహారంలో శాండిల్ వుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ పాత్ర ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. అయితే, టీఏఎస్‌సీ నిర్వహించిన స్టార్ నైట్ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను అంటూ వీసాపై పేర్కొంటూ ఆ కన్నడ స్టార్ హీరోయిన్ 2017 నవంబర్ 8న అమెరికాకు చేరుకుంది. స్టార్ నైట్ కార్యక్రమం ముగించుకున్న వెంటనే ఆ హీరోయిన్ షికాగోకు వెళ్లింది. దీంతో ఆమె వీసాను పరిశీలించిన పోలీసులకు అనుమానం వచ్చింది. కాలిఫోర్నియాకు వెళ్లాల్సిన ఆ హీరోయిన్ షికాగోకు వెళ్లింది. దీంతో ఆమెను వెంబడించిన పోలీసులకు కీలక సమాచారం లభ్యమైంది. సదరు హీరోయిన్ను పోలీసులు ఒంటరిగా విచారించడంతో అసలు నిజాలు వెల్లడయ్యాయి.