తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక బ్యూటీ పార్లర్ యజమాని ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి గీతారెడ్డి ,ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతి ఐజీ పేరు చెప్పి ఏకంగా సీఐనే బెదిరించాడు .అసలు విషయానికి నగరంలోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్ట్ మారేడుపల్లి షెనాయ్ నర్సింగ్ హోం వెనక వైపు ఉన్న సాఫ్ట్ లేడీ
బ్యూటీ పార్లర్ సెంటర్ ముందు పోలీసులు మరాఠా బస్తీకి దారి అంటూ ఒక సైన్ బోర్డును పెట్టారు .
see also:ఒక్కసారిగా ఉలిక్కిపడిన కరీంనగర్..అమ్మాయిని గొంతుకోసి హత్య
అయితే సదరు పార్లర్ యజమాని అయిన వివేక్ తనదగ్గరే పనిచేస్తున్న వ్యక్తుల చేత దాన్ని తీసేయించాడు .ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు పెట్టారు .దీంతో సీఐ కరుణాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు ఒక్కసారి రావాలని వివేక్ ను ఆదేశించారు.దీంతో చిర్రెత్తిపోయిన వివేక్ ఇలాంటి చిన్న చిన్న కేసులకు నేను పోలీస్ స్టేషన్ కు రావాలా ..నాకున్న సమయం ఎంతో విలువైంది .
see also:సంగీత దర్శకుడు ఆత్మహత్య..!
గంటకు లక్ష రూపాయలు నష్టం నాకు .అయిన మాజీ మంత్రి గీతారెడ్డి తన పార్లర్ కు రెగ్యులర్ కస్టమర్ ..అమరావతి ఐజీ నాకు తెలుసి ..నార్త్ జోన్ డీసీపీ సుమతి నా స్నేహితురాలు .ఒక్కఫోన్ చేస్తే నీ ఉద్యోగం ఊడుతుంది ఏమనుకుంటున్నావో అని బెదిరింపులకు దిగాడు.దీంతో సీఐ కరుణాకర్ రెడ్డి అమరావతి ఐజీ కి కాల్ చేసి అడుగగా అతను ఎవరో తనకు తెలియదని సమాధానం ఇచ్చాడు.దీంతో వివేక్ పై కేసులను నమోదు చేశారు సీఐ కరుణాకర్ రెడ్డి ..