ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) ఇక ముందు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై యోచనలో వున్నారు. ఆరోగ్యం సరిగా లేకపోవటం, ధన ప్రభావం ఎక్కువ కావటంతో పాటు వర్తమాన రాజకీయాల్లో వస్తోన్న మార్పులతో ఆయన పోటీ పడలేకపోతున్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. కుమారుడు చేతికి అందివచ్చినా , ఆయనకు రాజకీయాల పట్ల కంటే వ్యాపారాలపై ఎక్కువగా ఆసక్తి ఎక్కువట. దీనికి తోడు గతంలో ఏలూరు ఎంపీగా పలు మార్లు ప్రాతినిధ్యం వహించి కొన్నాళ్ల పాటు కేంద్ర సహాయ మంత్రిగా పని చేసిన దివంగత బోళ్ల బుల్లి రామయ్య వారసుడిగా ఆయన కుమారుడు తెరపైకి వస్తున్నారు.
see also:సీఎం రమేష్ షాకింగ్ డెసిషన్ ..!
అంతేకాదు ఇటీవల ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా విజవంతంగా పూర్తి చేసుకుంది .ఈ పాదయాత్రలో జగన్ తో పాటు నడిచిన ప్రజానికాన్ని చూసి తెలుగు తమ్ముళ్లు షాక్ అయ్యారంటా.. ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగనే అని ఆ జిల్లానేతలే ఏంపీతో అన్నారంట… దీంతో ఈ సారి వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయావకాశాలు అంతంత మాత్రంగానే వుండటంతో ఆయన పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాగంటి రాజకీయాలకు గుడ్ బై చేబితే నిజంగానే ఏపీలో టీడీపీకి మరో పెద్ద దెబ్బ తగిలినట్టే.