కుక్కుటం అంటే సంస్కృతంలో కోటి అని అర్థం. ఈ ఆసనం వేసిన తరువాత మన శరీరం కోడి ఆకారాన్ని పోలి ఉంటుంది. అందుకే ఈ ఆసనాన్ని కుక్కుటాసనంగా పేర్కొంటారు.
కుక్కుటాసనం వేసే విధానం : –
పద్మాసనంలోనే కూర్చొని చేతులను తొడలు, మరియు పిక్కల సందుల్లోంచి నేల మీద ఆనించి శ్వాస తీసుకుంటూ శరీరాన్ని పైకి లేపాలి. కొద్ది క్షణాలు అలానే ఉండి ఊపిరి వదులుతూ శరీరాన్ని కిందకు దించాలి. ఈ విధంగా ఐదు సార్లు చేస్తూ క్రమేపీ పెంచుకోవచ్చు.
కుక్కుటాసనం వేయడం వల్ల ఉపయోగాలు :-
పద్మాసనం వల్ల కలిగే అన్ని ఉపయోగాలతోపాటు కడుపులోని పురుగులను నివారిస్తోంది. శారీరక నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా స్త్రీలలో బహిష్ఠు సమయంలో వచ్చే అన్ని నొప్పులు కూడా నివారించబడతాయి. సహనాన్ని పెంచుతుంది. ఆత్మ విశ్వాసాన్ని వృద్ధి చేస్తుంది.