తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం గురించిన సంచలన విషయాలను వెల్లడించడమేకాకుండా తెలుగుదేశం పార్టీని ఆయన భ్రష్టుపట్టించిన విధానాలను బయటపెట్టిన మోత్కుపల్లి నర్సింహులును టీడీపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి మరిన్ని సంచలన విషయాలను మీడియాతో పంచుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు ఆయనపై ఎదురుదాడి మొదలుపెట్టారు. తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మోత్కుపల్లి నర్సింహులుపై మండిపడ్డారు. అయితే చంద్రబాబును కవర్ చేయబోయి ఎల్.రమణ బుక్ అయ్యాడని పలువురు అంటున్నారు.
see also:కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ ఫ్లెక్స్..!!
తెలుగుదేశం పార్టీ నుండి వెళ్లిపోయిన మోత్కుపల్లి వైసీపీ నేత విజయ సాయిరెడ్డిని కలవడం ఏంటని రమణ ప్రశ్నించారు. నర్సింహులు పెడితే పెళ్లికి లేకపోతే చావుకు అన్నట్టు వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. బడుగు బలహీనవర్గాలకు స్థానం ఇచింది తెలుగుదేశం పార్టీ అని పేర్కొంటూ తెలుగుదేశం పార్టీ వ్యక్తులను చూసి భయపడే పార్టీ కాదని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగుతోందన్నారు. `గతంలో మోత్కుపల్లి నర్సింహులు అమరావతి లో నాకు స్థలం ఇవ్వండి అక్కడే ఉండి పార్టీ కి పని చేస్తా అని అన్నాడు ..ఈరోజేమో ఇలా వ్యవహరిస్తున్నాడు. బడుగులకు అవకాశం కావాలంటే మోత్కుపల్లికి ఇచ్చాము. ఎందరో ఈ పార్టీ ద్వారా పార్లమెంట్ కి వెళ్లిన, ఎదిగినోళ్లు ఉన్నారు. గతంలో మోత్కుపల్లి కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ అని చెప్పారు. ఆ మాటలే ఈరోజు నీటి మూటలా? మోత్కుపల్లి కన్నతల్లి కి ద్రోహం చేసినట్టే“ అని విమర్శించారు. “జగన్, పవన్ కల్యాణ్ మీద నువు అన్న మాటలను ప్రజలు విన్నారు. పార్టీ ని విమర్శించడం మంచిది కాదు…ఇటువంటి నాయకులు పార్టీ కి అవసరం లేదు..ఇది ప్రజల పార్టీ“అని అన్నారు.
see also:వికలాంగుల సంక్షేమం కోసం కేంద్రమంత్రికి ఎంపీ కవిత కీలక డిమాండ్
కాగా, ఈ సందర్భంగా చంద్రబాబుపై మోత్కుపల్లి నర్సింహలు చేసిన కామెంట్లలో నిజం ఎంత ఉందనే విషయాన్ని మీడియా ప్రశ్నించగా ఎల్.రమణ సమాధానం దాటవేయడం గమనార్హం. అంతేకాకుండా….మోత్కుపల్లిని టీడీపీ బహిష్కరించిన విషయాన్ని పక్కన పెట్టి ఆయనే పార్టీ నుంచి వెళ్లిపోయినట్లు ప్రచారం చేయడం కొసమెరుపు.
see also:కాంగ్రెస్‌లో కల్లోలం..నేతల చేరికలతో కొత్త వివాదం