రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిస్తాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పధకాన్ని సికింద్రాబాద్ లో భారీ స్థాయిలో చేపట్టేందుకు అనువైన ప్రభుత్వ స్థలాల కొరత నేపద్యమలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి అనువుగా నిలుస్తున్న లాలాపేట లోని ఖాళీ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల మంత్రి పద్మారావు గౌడ్ కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ కు శుక్రవారం సికింద్రాబాద్ స్టేషన్ లో ఓ వినతి పత్రాన్ని అందించారు.
see also:డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్..!!
సికింద్రాబాద్ లోని ఖాళి స్థలాల కొరత ఉందని, దశాబ్దాలుగా ఖాళీగా నిరుపయోగంగా ఉన్న లాలాపేట లోని రైల్వే స్థలాన్ని కేటాయించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. గతంలో పలు సందర్భాల్లో కేంద్రానికి ఈ అంశం పై నివేదించిన ప్పటికి, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి రైల్వే శాఖ సానుకూలంగా స్పందించలేదు. దాంతో మంత్రి పద్మారావు గౌడ్ తాజాగా మరో సరి ఈ అంశాన్ని కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రతిపాదిత 12.16 ఎకరాల లాలాపేట రైల్వే స్థలాన్ని వాణిజ్య అవసరాలకు కేటాయించి అభివృధి చేస్తున్నామని రైల్వే శాఖ పెర్కొన్నపటికి, దశాబ్దాలుగా ప్రతిపాదిత స్థలం ఖాళీగానే ఉందని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి ఉపకరించేలా ఉందని పద్మారావు గౌడ్ వివరించారు.
see also:షాది ముబారక్ ద్వారా రూ.1,00,116 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణే
అదే విధంగా దక్షిణ మధ్య రైల్వే ద్వారా చేపట్టనున్న విస్తరణ అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వ సహకరించేందుకు సిద్దంగా ఉందని, ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా కేటాయిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిరుపేదల స్వప్నాన్ని నెరవేర్చేందుకు తాము చేస్తున్న కృషికి సహకరించాలని ఆయన కోరారు.