రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన చేర్యాల గ్రామంలో రూ.1కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచ్ ముస్త్యాల అరుణ, నాయకలు ఉన్నారు. అనంతరం చేర్యాల లోని ఫంక్షన్ హాల్ లో జరిగిన టీఆర్ ఎస్ పార్టీలో మంత్రి సమక్షంలో భారీగా చేరికల కార్యక్రమం జరిగింది.
see also:కొమురవెల్లికి మహర్దశ..మంత్రి హరీశ్
సిద్ధిపేట పట్టణంలోని శరభేశ్వర ఆలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ మేరకు అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అమర్ నాథ్ వెళ్లే యాత్రికులకు బాల్తాల్, పంచతరణిలో ఉచితంగా తెలుగు వారికి భోజనం, ఆహార పదార్థాల పంపిణీకై వినియోగించే లారీని జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు జరిగిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..
see also:బాబును కవర్ చేయబోయి బుక్కయిన రమణ
ఆక్సిజను ఎక్కువగా ఇచ్చేలా చెట్లు పెంచే ప్రయత్నం చేపడుతున్నామని మంత్రి వివరిస్తూ.. దక్షిణ భారత దేశంలోనే సిద్ధిపేట బెస్ట్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అవార్డు పొందామని, దీంతో మనపై బాధ్యత పెరిగిందంటూ.. పట్టణ ప్రజలు సహకారంతోనే ఇది సాధ్యమైందంటూ.. ప్లాస్టిక్ సంచులు వాడొద్దని, ప్రతి ఒక్కరూ ఒక చెట్టు పెట్టి పెట్టాలని.. ఆ చెట్టును సంరక్షణ చేయాలని మంత్రి కోరారు.
see also:కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ ఫ్లెక్స్..!!
ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే.. అది అమృతంతోనే సమానమని అమర్ నాథ్ యాత్రికుల కొరకు అమర్ నాథ్ అన్న దాన సేవ సమితి ఆధ్వర్యంలో ఇలాంటి ఈ సేవలు చేయడం సిద్ధిపేటకే గర్వకారణమని మంత్రి చెప్పుకొచ్చారు. 8వ సంవత్సరంలో అమర్ నాథ్ యాత్రికులకు అన్నదాన సేవ కార్యక్రమాలు అందిస్తూ.. మానవ సేవయే మాధవ సేవగా.. భక్తులకు సేవ చేస్తే.. భగవంతునికి చేసినట్లేనని అలాంటి.. సేవలకు నిలయం మన సిద్ధిపేట అని మంత్రి పేర్కొన్నారు.
see also:వికలాంగుల సంక్షేమం కోసం కేంద్రమంత్రికి ఎంపీ కవిత కీలక డిమాండ్
అన్నదాన సేవా సమితి, హనుమాన్ భక్త అన్న దాన సేవా సమితులు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ.. మంచి పెరిగిందని, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నామని, ఇదే స్ఫూర్తితో సమాజ సేవలో అందరం భాగస్వాములవుదామని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, అమర్ నాథ్ అన్న దాన సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.