ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి ట్విట్టర్ సాక్షిగా అడ్డంగా బుక్ అయ్యారు .గత నాలుగు ఏళ్ళుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేసే ప్రధాన ఆరోపణల్లో ఒకటి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు నట్టింట ముంచారు .
see also:ఏపీ సీఎం చంద్రబాబుపై సీబీఐ విచారణ ..!
దీనికి కౌంటర్ ఇస్తూ నారా లోకేష్ నాయుడు ట్విట్టర్ లో గత నాలుగు ఏళ్ళుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణకు సమాధానం దొరికింది.ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించే వైసీపీ నేతలకు కేంద్ర మంత్రి ఏపీలో పెట్టుబడుల గురించి ,ఉపాధి కల్పన గురించి చెప్పిన సమాధానమే జవాబు అని ఆయన అన్నారు.
see also:వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత ..!
అంతే కాకుండా ఎక్కడ ఏ కంపెనీ ఉందో ..ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ఒక బస్సులో తీసుకెళ్ళి మరి చూపిస్తామని ఆయన అన్నారు .అయితే రానున్న ఎన్నికల్లోపు రెండు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెబుతున్న లోకేష్ ఇప్పటికిప్పుడు నాలుగు లక్షల ఉద్యోగాలు ఎలా వచ్చాయి ..కావాలని ఫోటో మార్ఫింగ్ చేసి ఇలా పెడుతున్నారు .కాపీ కొట్టడం కూడా చిన్నబాబుకు రాక మరోసారి పప్పులో కాలేశారు అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు ..